మొసళ్లు.. తెల్లపులులున్న వాహనానికి యాక్సిడెంట్.. కట్ చేస్తే?
అవును.. తెల్ల పులులు.. మొసళ్లతో ఉన్న రెండు వాహనాలు బెంగళూరుకు వెళుతున్న వేళ.. తెలంగాణలో బోల్తా పడిన ఉదంతమిది
By: Tupaki Desk | 17 Oct 2024 6:30 AM GMTఅవును.. తెల్ల పులులు.. మొసళ్లతో ఉన్న రెండు వాహనాలు బెంగళూరుకు వెళుతున్న వేళ.. తెలంగాణలో బోల్తా పడిన ఉదంతమిది. బిహార్ నుంచి బెంగళూరులోని జూపార్కుకు తరలిస్తున్న క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదం కాసేపు టెన్షన్ పుట్టించింది. అయితే.. అటవీ అధికారులు తక్షణమే స్పందించటంతో ఎలాంటి అనూహ్య పరిణామం చోటుచేసుకోలేదు.
బిహార్ రాష్ట్ర రాజధాని పట్నా నుంచి బెంగళూరులోని బన్నేరుగట్ట జాతీయ జూపార్కుకు ఘరియాల్ జాతికి చెందిన మొసళ్లు.. అరుదైన తెల్లపులులు ఉన్నాయి. రెండు వాహనాల్లో బయలుదేరగా.. తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి ఈ వెహికిల్స్ చేరుకున్నాయి. అనుకోని విధంగా రెండు వాహనాల్లో ఒక వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో 8 మొసళ్లు వాహనం నుంచి బయటకు వచ్చాయి. అయితే.. అవి తప్పించుకోకుకండా ఉండేందుకు స్థానిక అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మరో వాహనాన్ని ఏర్పాటు చేసి.. వాటిల్లోకి అన్నింటిని తరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ.. బోల్తా పడిన వాహనంలో తెల్ల పులులు ఉన్నట్లైయితే.. అన్న ఆలోచన టెన్షన్ పుట్టేలా చేస్తోంది. ఏమైనా.. జంతువుల తరలింపు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.