Begin typing your search above and press return to search.

2 గంటల్లో 25 వేల కోట్లు నష్టపోయిన జుకర్ బర్గ్

ఇక, తాజాగా 2 గంటల పాటు ఫేస్బుక్, ఇన్స్టా సేవలు నిలిచినందుకుగాను జుకర్ బర్గ్ దాదాపు 25 వేల కోట్ల రూపాయలను నష్టపోయాడు అని తెలియడంతో మీమర్స్ మరోసారి రెచ్చిపోయారు.

By:  Tupaki Desk   |   8 March 2024 12:16 PM GMT
2 గంటల్లో 25 వేల కోట్లు నష్టపోయిన జుకర్ బర్గ్
X

2 రోజుల క్రితం ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల సేవలకు 2 గంటల పాటు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అయితే అదే సమయంలో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ల మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు జుకర్ బర్గ్ హాజరయ్యారు. దీంతో, జుకర్ బర్గ్ పెళ్లి హడావిడిలో పడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లను పట్టించుకోలేదని, అందుకే అవి క్రాష్ అయ్యాయని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి.

ఇక, తాజాగా 2 గంటల పాటు ఫేస్బుక్, ఇన్స్టా సేవలు నిలిచినందుకుగాను జుకర్ బర్గ్ దాదాపు 25 వేల కోట్ల రూపాయలను నష్టపోయాడు అని తెలియడంతో మీమర్స్ మరోసారి రెచ్చిపోయారు. అనంత్ అంబానీ విందు భోజనం జుకర్ బర్గ్ కు చాలా నష్టం చేకూర్చిందని, ఒక డిన్నర్ ఖరీదు దాదాపు పాతిక వేల కోట్లు అని తెలిస్తే ఆయన ఇండియాకు వచ్చి ఉండే వారే కాదని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక్క రోజులోనే జుకర్ బర్గ్ దాదాపు 3 మిలియన్ డాలర్ల రూపాయలను నష్టపోయాడని అతడిపై కొంతమంది నెటిజన్లు జాలి చూపిస్తున్నారు.

ఆ రెండు గంటల క్రాష్ కు గాను జుకర్ బర్గ్ నికర విలువ 2.79 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో, బ్లూమ్స్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో జుకర్ బర్గ్ సంపద 176 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇంత జరిగినా సరే ప్రపంచ కుబేరుల జాబితాలో మాత్రం జుకర్ మామ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక, మెటా షేర్లలో 1.6 శాతం తగ్గుదల కనిపించింది. ఏదేమైనా మంగళవారం రాత్రి 8:30 నుంచి 10:30 వరకు కేవలం రెండు గంటలపాటు ఫేస్బుక్, ఇన్స్టా సేవలు నిలిచిపోతేనే జుకర్ బర్గ్ కు పాతిక వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, అదే మరో ఆరు ఏడు గంటలు నిలిచిపోయి ఉంటే దాదాపు లక్ష కోట్లు నష్టపోయి ఉండేవాడని నెటిజన్లు అవాక్కవుతున్నారు.