Begin typing your search above and press return to search.

ధరణి అతిపెద్ద భూ స్కాం? సంచలనంగా బొమ్మరాశిపేట రైతుల యాడ్

బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన బొమ్మరాశిపేట రైతు సంక్షేమ సంఘం ప్రముఖ దినపత్రికల్లోని మొదటి పేజీ లో ఇచ్చిన యాడ్ కేసీఆర్ సర్కారు కు షాకింగ్ గా మారిందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   14 July 2023 5:36 AM GMT
ధరణి అతిపెద్ద భూ స్కాం? సంచలనంగా బొమ్మరాశిపేట రైతుల యాడ్
X

'మేం అధికారం లోకి వచ్చినంతనే ధరణిని రద్దు చేస్తాం' అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ కు నష్టం చేస్తుందన్న వాదన లో పస లేదన్న విషయం తాజాగా విడుదలైన ఒక ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ధరణి విషయం లో అధికార పార్టీ చేస్తున్న వాదన లో పస లేదన్న విషయం పై పలువురు చేస్తున్న విమర్శలు.. ఆరోపణలున్న విషక్ష్ం తెలిసిందే. అయితే.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా లోని శామీర్ పేట మండలం బొమ్మరాశిపేట గ్రామానికి చెందిన బొమ్మరాశిపేట రైతు సంక్షేమ సంఘం ప్రముఖ దినపత్రికల్లోని మొదటి పేజీ లో ఇచ్చిన యాడ్ కేసీఆర్ సర్కారు కు షాకింగ్ గా మారిందని చెప్పాలి.

'గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుగారికి బహిరంగ లేఖ' పేరుతో "తెలంగాణ రాష్ట్రం లో అతి పెద్ద భూ కుంభకోణానికి తావిచ్చిన ధరణి" అన్న శీర్షికన మొదటి పేజీ లోని కుడిచేతి వైపున పబ్లిష్ చేయించిన వాణిజ్య ప్రకటన ఇప్పుడు రాజకీయ ప్రకంపనల్ని రేపుతోంది. తమ గ్రామం లోని 300 మందికి పైగా రైతుల కు చెందిన 550 ఎకరాల కు సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు వీలుగా వారు వినిపించిన వాదన ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసిందని చెప్పాలి.

అసలు భూమి యజమానుల నుంచి 40-50 ఏళ్లకు ముందు రిజిస్టర్డ్ సేల డీడ్స ద్వారా భూముల ను కొనుగోలు చేసిన విషయాన్ని పేర్కొన్నారు. తమకు ఈ పాస్ బుక్ లు ఇవ్వటంతో పాటు ధరణి లో రెవెన్యూ రికార్డులో ఉన్నామని.. రైతు బంధు.. రైతు బీమా.. రుణ సదుపాయాలు మొదలైన సంక్షేమ పథకాల ను తాము పొందుతున్నట్లు సదరు ప్రకటన లో పేర్కొన్నారు. రెవెన్యూ అధికార్లు లిటిగెంట్ల పలుకుబడితో తమ గ్రామాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని.. దీంతో ఎలాంటి రిజిస్ట్రేషన్లు.. మ్యుటేషన్లు చేసేందుకు వీలు లేని విధంగా చేశారని పేర్కొన్నారు.

రెవెన్యూ అధికారుల నిర్ణయంతో తాము జనవరి లో ఆందోళన చేయగా.. శామీర్ పేట మండల తహశీలుదారు హామీతో సాధారణ లావాదేవాల్ని చేసుకోవటానికి వీలుందని హామీ ఇచ్చారని.. కానీ.. అందుకు భిన్నంగా తమ లావాదేవీల్ని అడ్డుకొంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దయ ఉంచి ఈ భారీ భూకుంభకోణం పై విచారణ జరిపించాలని.. సంబంధిత కోర్టు సూచనల ప్రకారం వ్యవహరించాల ని కోరుతున్నారు.

నిబంధనల కు విరుద్ధంగా రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా మార్పులు చేర్పులు చేస్తున్నట్లు ఆరోపించారు. ధరణి పేరుతో సాగుతున్న కుంభకోణం పై వారు ఎలుగెత్తిన వైనం తెలంగాణ అధికారపక్షానికి తలనొప్పిగా.. తాము చేస్తున్న వాదనకు తగ్గట్లుగా తాజా ఉదంతం బయట కు రావటం విపక్షాల కు మరింత నైతిక బలాన్ని ఇచ్చేలా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ యాడ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రీతి లో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.