Begin typing your search above and press return to search.

'ఫ్రెంచ్ కిస్'... ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యక్తం చేస్తారు

By:  Tupaki Desk   |   14 July 2023 5:38 AM GMT
ఫ్రెంచ్ కిస్... ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
X

అసలు నాలుగు పెదాలు కలిసి పెట్టుకునే ముద్దుకు ఆ పేరు ఎలా వచ్చింది.. ఎందుకు వచ్చింది.. ఎప్పుడువచ్చింది.. అనేది ఇప్పుడు చూద్దాం!

ముక్కుపై ముద్దు పెట్టు ముక్కెరై పోయేట్టు

చెంపపై ముద్దు పెట్టు చెక్కరై పోయేట్టు

మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకేట్టు

గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు...

అంటూ ఎక్కడ ముద్దు పెడితే ఎలాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉందో చెప్పే పాట "చందమామ" సినిమాలో సాయిశ్రీహర్ష అద్భుతంగా రాశాడు! అయితే ముద్దులందు "ఫ్రెంచ్ ముద్దు" వేరయా అంటుంటారు ముద్దు ప్రియులు!

ప్రేమను ఒక్కొక్కరూ ఒక్కో రకంగా వ్యక్తం చేస్తారు. అందులో ముద్దు కూడా ఒకటి అని అంటారు. అయితే ముద్దు అనేది ఎప్పటికీ ప్రత్యేకమైనదే అనేది ఎక్కువమంది చెప్పే మాట! పిల్లలకు పెద్దలు పెట్టే ముద్దు నుంచి.. భార్యాభర్తలు ప్రేమికులు పెట్టుకొనే ముద్దు వరకు.. ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే! ఒకరి పెదాలు మరో వ్యక్తి తనువును ఎక్కడ తాకినా అది ప్రేమే అంటారు!

ముద్దును ముద్దుగా "ముద్దు" అనే అంటారు. ఇంగ్లిష్ లో అయితే "కిస్" అని అంటారు. కాస్త బిగి కౌగిళిలో మరింత గిలికింతలు కలిగేలా పెట్టుకునే ముద్దును "స్మూచ్" అంటారు. ఈ సమయంలో అసలు "ఫ్రెంచ్ కిస్" అనేది ఎలా వచ్చింది అనేది చాల మందికి ఉండే సందేహమే అనడంలో సందేహం ఉండకపోవచ్చు! అయితే ఆ ముద్దును ఫ్రెంచ్ కిస్ అని పిలవడానికీ ప్రపంచయుద్ధానికీ సంబంధం ఉందని తెలుస్తుంది.

అవును... ఫ్రెంచ్ కిస్ అనేది ఒక రసిక ముద్దు. ఈ ముద్దులో పాల్గొనేవారి నాలుగు పెదవులూ కలుసుకుంటున్న సమయంలో వారి రెండు నాలుకలూ ఆ పెద్దల మధ్య నాట్యమాడుతూ ఉంటాయి. ఫలితంగా ఇవి స్పర్శకు సున్నితంగా ఉండటంతో లైంగిక ప్రేరేపణను ప్రేరేపిస్తాయి. ఎందుకంటే నోటి జోన్ శరీరంలోని ప్రధాన ఎరోజెనస్ జోన్ లలో ఒకటి.

ఇందులో భాగంగా... ఫ్రెంచ్ ముద్దును తరచుగా "ఫస్ట్ బేస్"గా వర్ణిస్తారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న బంధం యొక్క ఘాడతను కూడా ఈ కిస్ తెలియజేస్తాదని అంటుంటారు. ఇప్పుడు అసలు ఆ ముద్దుకు "ఫ్రెంచ్ కిస్" అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం!

మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా బ్రిటీష్ సైనికులకు ఫ్రాన్స్లో మాంచి ఆతిథ్యం లభించిందట. ఈ సైనికులు అక్కడ ఉన్నప్పుడు ఫ్రాన్స్ మహిళలతో ఏర్పడిన సంబంధం ఓ తీపి గుర్తుగా మిగిలిపోయేదట. దానికి కారణం.. అక్కడి మహిళలు పెట్టే ముద్దు అట. అంటే... ఆ స్థాయిలో ఉండేదన్నమాట ఆ ముద్దు.

సాధారణంగా అమెరికన్లు బ్రిటీషర్లు గౌరవ సూచకంగా పెదాలతో ముద్దు పెట్టుకుంటారు. టచ్ అయ్యీ అవ్వనట్లు ఉంటుంది ఆ ముద్దు. పైగా పెదవులు కలిసే ఆ ముద్దు ఉంటుంది అంటారు! కానీ ఫ్రాన్స్ మహిళలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ముద్దు పెట్టేవారట. నోరు పెద్దగా తెరిచి.. నాలుక - నాలుక కలిసేలా గాఢమైన ముద్దు పెట్టేవారట. మరింత బలంగా చెప్పాలంటే... అదో చిన్నసైజు "టంగ్ వార్" అన్నమాట.

ఇలా ఆ మహిళలు పెట్టే ఆ ముద్దు ఎంతో ఉద్వేగభరితంగా ఉండటంతో.. దానికి "ఫ్రెంచ్ కిస్" అని పేరుపెట్టారట. అనంతరం ఫ్రాన్స్ నుంచి తమ దేశాలకు తిరిగి వెళ్లిన సైనికులు ఈ ముద్దును అక్కడివారికి పరిచయం చేశారట. అప్పటి నుంచి ఉద్వేగభరితంగా.. నాలుగు పెదాలను కలుపుతూ నాలుకలతో సయ్యాటలాడే ముద్దుకు "ఫ్రెంచ్ కిస్" అని పేరు వచ్చిందట.

ఇక రెండో ప్రపంచ యుద్ధం సమయానికి "ఫ్రెంచ్ కిస్" ఎల్లలు దాటేసిందట. ఫలితంగా... అలా "వార్" కోసం వెళ్లినవారు.. ఫ్రాన్స్ లో "టంగ్ వార్" ట్రెండ్ తెలుసుకుని బాగా అలవాటుపడ్డారంట.

అయితే ఈ ముద్దును అమెరికా గ్రేట్ బ్రిటన్ లలో "ఫ్రెంచ్ కిస్" అని పిలిస్తే ఫ్రాన్స్ లో మాత్రం... దీనిని అన్ బైసర్ అమోరియక్స్ (ప్రేమికుల ముద్దు) లేదా అన్ బైసర్ అవెక్ లా లాంగ్యూ (నాలుకతో ముద్దు) అని పిలుస్తారు. అది మేటర్... ఈ ఫ్రెంచ్ కిస్ కి ఇంత చరిత్ర ఉందన్నమాట! ఫ్రాన్స్ అమ్మాయిలా మజాకా...!!