ఆనం నియోజకవర్గానికి జగన్... ఆట మొదలైనట్లేనా?
ఈ సమయం లో జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.
By: Tupaki Desk | 14 July 2023 6:22 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీరాజకీయాల్లో రసవత్తర సిట్యువేషన్స్ తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైందని తెలుస్తుంది. ఈ పర్యటన లో భాగంగా... వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం వెంకటగిరికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారని అంటున్నారు.
అవును.. నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి కాదని టీడీపీ వైపు మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరంతా టీడీపీ లో చేరేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. ఉమ్మడి నెల్లురు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్రను కూడా అన్నీ వీరై నడిపించారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ లను కూడా నియమించింది. ఈ సమయం లో జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారుతోంది.
నేతన్న నేస్తం పథకం కింద బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే కార్యక్రమాన్ని ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నిర్వహించాల ని ప్రభుత్వం భావించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్.. వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలుస్తుంది. దీంతో జగన్.. వెంకటగిరి టూర్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి 21వ తేదీన నేతన్న నేస్తం కార్యక్రమాన్ని మంగళగిరి లో చేపట్టాల ని ప్రభుత్వం తొలుత నిర్ణయించిందంట. అయితే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాత్రం... ఈసారి తమ నియోజకవర్గం లో జగన్ సభ ను నిర్వహించాలని పట్టుబట్టారని అంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గం లో చేనేత కార్మికులు కూడా అధిక సంఖ్యలో వుండడంతో ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించాల ని ఫైనల్ డెసిషన్ కి వచ్చారని అంటున్నారు.
కాగా... 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లురు జిల్లాలో వైసీపీ మొత్తం పది సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు టీడీపీ కి అనుకూలంగా ఓటు వేశారని ఆరోపిస్తూ పార్టీ వారిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో తాము టీడీపీ లో చేరబోతున్నట్లు ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే!
దీంతో ఈసారి నెల్లూరు జిల్లాలో ఎలాగైనా వైసీపీ ని దెబ్బ తీయాల ని టీడీపీ భావిస్తోందని తెలుస్తోంది. తన పాదయాత్రలో భాగంగా లోకేష్ కూడా స్థానిక వైసీపీ నేతల పై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు! దీంతో.. వైసీపీ నాయకత్వం అలర్ట్ అయిందని అంటున్నారు. అందులో భాగంగా.. టీడీపీ కి చెందిన పలువురు నేతల ను ఆకర్షించే ప్రయత్నం లో ఉన్నారని కూడా తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్... ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనుండటం రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుందన్ని అంటున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి!!