వారాహి ఎంట్రీ పాసులు రూపాయి నోటుతో ఎందుకు?
రోటీన్ పాసులకు భిన్నంగా ఇస్తున్న నకలు రూపాయి నోట్లు
By: Tupaki Desk | 14 July 2023 10:43 AM ISTజనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర సెకండ్ ఎడిషన్ సందర్భంగా బహిరంగ సభలతో పాటు.. పార్టీ సమావేశాలు.. పార్టీకి చెందిన మహిళా విభాగంతో చర్చలు నిర్వహిస్తున్నారు జనసేనాని.
వరుస పెట్టి షెడ్యూల్ సిద్ధం చేసి.. అందుకు తగ్గట్లు కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు పవన్ కల్యాణ్. తాజాగా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా పార్టీ మహిళా విభాగమైన వీర మహిళలతో సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం ఒకటి కనిపించింది.
తణుకులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ వీరమహిళల సమావేశంలో ఎంట్రీ పాసుల కింద వినూత్న ఏర్పాట్లు చేశారు. నకలు రూపాయి నోట్ల మీద జనసేన స్టాంపు వేసిన నోట్లను అందించారు.
ఎందుకిలా? అంటే.. ఆసక్తికర సమాధానాన్ని ఇస్తున్నారు. పార్టీ ఇస్తున్న పాసుల్ని కలర్ జిరాక్సుల్ని తీసుకొస్తున్నారని.. అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా నకలు రూపాయి నోట్ల మీద జనసేన పార్టీ స్టాంపు వేసి ఇస్తున్నట్లు చెబుతున్నారు.
రోటీన్ పాసులకు భిన్నంగా ఇస్తున్న నకలు రూపాయి నోట్లు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ నోట్లను జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పంపుతున్నట్లు చెబుతున్నారు. అసలు రూపాయి నోట్ల మాదిరి ఉన్న ఈ నకలు రూపాయి నోట్లు.. పవన్ సమావేశాల్లో ప్రత్యేకంగా మారాయి.