Begin typing your search above and press return to search.

యాప్ టార్చర్: 22 ఏళ్ల యువకుడిషాకింగ్ సూసైడ్ నోట్!

అప్పు తీర్చడంలో విఫలమైతే అతని మొబైల్ ఫోన్ లో ఉన్న పర్సనల్ ఫోటోల ను బయటపెడతామ ని బెదిరిస్తూ బ్లేక్ మెయిల్ కు పాల్పడ్డారట.

By:  Tupaki Desk   |   14 July 2023 5:16 AM GMT
యాప్ టార్చర్: 22 ఏళ్ల యువకుడిషాకింగ్ సూసైడ్ నోట్!
X

ఆన్ లైన్ లోని లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న దారుణాలు గతకొంతకాలంగా నిత్యం ఏదో ఒక మూల దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే! పైగా ఈ మధ్యకాలం లో లోన్ యాప్స్ టార్చర్ వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో దారుణం చోటుచేసుకుందని తెలుస్తుంది.

అవును... లోన్ యాప్స్ ప్రమాదాల ను వెలుగు లోకి తెచ్చే హృదయ విదారక ఘటన లో తాజాగా మరొక సంఘటన వచ్చి చేరిందని తెలుస్తుంది. 22 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి.. చైనీస్ మొబైల్ అప్లికేషన్ కు లోన్ లు అందిస్తున్న ఏజెంట్ల కనికరంలేని వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది.

బెంగళూరు లోని నిట్టె మీనాక్షి కాలేజీ లో చదువుతున్న తేజస్... "స్లైస్ అండ్ కిస్" యాప్ నుండి డబ్బు తీసుకున్నాడని అంతున్నారు. ఈ క్రమంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయాడని తెలుస్తుంది. ఈ సమయం లో లోన్ యాప్ ఏజెంట్లు నీచమైన పనుల కు తలపడ్డారని అంటున్నారు. అప్పు తీర్చడంలో విఫలమైతే అతని మొబైల్ ఫోన్ లో ఉన్న పర్సనల్ ఫోటోల ను బయటపెడతామ ని బెదిరిస్తూ బ్లేక్ మెయిల్ కు పాల్పడ్డారట.

ఈ సమయం లో తేజస్ తండ్రి గోపీనాథ్... విడతల వారీ గా లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించినప్పటికీ ఏజెంట్లు వేధింపుల ను కొనసాగించారని అంటున్నారు. దీంతో వేదింపులు తాళలేక.. తేజాస్ ఆత్మహత్య నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. ఈ విషాదం జరిగిన రోజున యాప్ ఏజెంట్ల నుండి తేజస్ కు అనేకరకాలుగా వేదింపు ఫోన్ కాల్స్ వచ్చాయని తెలుస్తుంది.

దీంతో పూర్తిగా డీలా పడిన తేజాస్... ఇక తన జీవితాన్ని ముగించుకోవడం తప్ప మరో మార్గం లేదని భావించి ఉంటాడని అంటున్నారు. ఈ సమయం లో హృదయవిదారకమైన నోట్ లో తన తల్లిదండ్రుల కు క్షమాపణలు చెప్పిన తేజాస్... తన పై పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడని తెలుస్తుంది!

దీంతో... ఇలాంటి విషాదకర సంఘటనలు వెలుగు లోకి వచ్చినతర్వాతైనా... ప్రభుత్వాలు సాంకేతిక సంస్థలు ఆర్థిక సంస్థలు ఈ సమస్యల ను పరిష్కరించడానికి కలిసి పని చేయాల ని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయం లో వినియోగదారుల రక్షణ పట్ల ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా... ఇలాంటి విషాదరకరమైన సంఘటనలు జరుగుతున్నాయని తెలుస్తున్న నేపథ్యంలో... లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని పలువురు సూచిస్తున్నారు!!