Begin typing your search above and press return to search.

చంద్రబాబును ఇరికించేసిన రేవంత్... తెరపైకి బషీర్ భాగ్ కాల్పులు!

మరోసారి బహీర్ భాగ్ కాల్పుల ఘటనను పరోక్షంగా రేవంత్ తెరపైకి తెచ్చిన రేవంత్...

By:  Tupaki Desk   |   14 July 2023 6:19 AM GMT
చంద్రబాబును ఇరికించేసిన రేవంత్... తెరపైకి బషీర్ భాగ్ కాల్పులు!
X

గతం లో టీడీపీ లో కీలకంగా వ్యవహరించిన నేతల్లో.. చంద్రబాబుకి అతిసన్నిహితుల్లో తెలంగాణ లో రేవంత్ రెడ్డి ఒకరని అంటుంటారు. ఓటు కు నోటు వ్యవహారం సమయంలో కూడా చంద్రబాబు.. రేవంత్ నే నమ్మారని చెబుతుంటారు. ఈ సమయంలో చంద్రబాబు ని ఇరికించే మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి!

అవును... రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు కానీ... ఆయన రాజకీయ ఎదుగుదల కు టీడీపీనే ప్రధాన కారణం అని మరి ముఖ్యంగా చంద్రబాబు ప్రోత్సాహం మరింత ప్రధానమైందని అంటుంటారు. ఇదే సమయం లో రేవంత్ కి కూడా చంద్రబాబు నాయుడు పై అభిమానం గౌరవం ఇప్పటికే అలానే ఉన్నాయని చెబుతుంటారు.

ఇదే క్రమంలో టీడీపీని వీడి చాలా ఏళ్లయినా.. తెలంగాణ లో కాంగ్రెస్ కు వ్యతిరేకపక్షంగా ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ను ఇప్పటివరకూ పల్లెత్తు మాట కూడా రేవంత్ అనలేదని గుర్తుచేస్తుంటారు. ఆఫ్ ద రికార్డ్ కూడా ఏనాడూ చంద్రబాబు ని తూలనాడలేదని అంటుంటారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అంటే టీడీపీ వారికి దశాబ్దాల వ్యతిరేకత ఉన్నప్పటికీ.. రేవంత్ అధ్యక్షుడు కావడం వల్ల కాంగ్రెస్ కు మద్దతిస్తున్న టీడీపీ వాళ్లూ చాలామంది ఉన్నారని అంటుంటారు.

ఇదే సమయం లో 2018 ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తుంటారు. ఇలా అన్ని విషయాల్లోనూ రేవంత్ - బాబు కలిసే నడిచేవారని అంటుంటారు. ఈ నేపథ్యంలో... కేసీఆర్ ని విమర్శించే క్రమంలోనో ఏమో కానీ... చంద్రబాబు ను ఇరుకునపెట్టేలా రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

అవును... తెలంగాణ లో రైతుల కు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని.. మూడు గంటలు చాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీని పై రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తోందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీఆరెస్స్ నేతలు నోటికి పనిచెప్పారు.. రేవంత్ పై ఫైరవుతున్నారు. ఈ సమయం లో బీఆరెస్స్ నేతలు తన పై చేస్తున్న దాడి ని తిప్పికొట్టే క్రమంలో మైకులముందుకు వచ్చిన రేవంత్... ఉమ్మడి ఏపీ టాపిక్ ఎత్తారు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల కు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వామపక్ష పార్టీల తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టిందని రేవంత్ గుర్తుచేసుకున్నారట. ఆ సమయం లో ఆందోళనల్లో పాల్గొన్న రైతుల ను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం పిట్టల్ని కాల్చినట్లు కాల్చిందని రేవంత్ అన్నారని తెలుస్తుంది.

ఈ రకంగా మరోసారి బహీర్ భాగ్ కాల్పుల ఘటనను పరోక్షంగా రేవంత్ తెరపైకి తెచ్చిన రేవంత్... నాడు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకంగా ఉన్నారని.. పాలసీ విధానాల ను నిర్ణయించే కమిటీ లో ఆయనది ముఖ్య పాత్ర అని విమర్శించారు. అలా నాడు రైతుల కు వ్యతిరేకంగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడు రైతుల మేలు గురించి మాట్లాడటం ఏంటని రేవంత్ ప్రశ్నించారు.

ఇలా నాడు బషీర్ భాగ్ లో జరిగిన కాల్పుల కు కేసీఆర్ కూడా కారణం అని నాడు కేసీఆర్ రైతు వ్యతిరేకిగా ఆలోచనలు చేశారని చెప్పే క్రమంలో... ఇలా బాబు ని ఇరుకునపెట్టారని అంటున్నారు! ఫలితంగా... కేసీఆర్ ను విమర్శించడం సంగతేమో కానీ.. చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన రైతుల ను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిందని గుర్తుయ్చేసినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు.

మరి ఈ విషయాల పై టీడీపీ నేతలు ఏమైనా స్పందిస్తారా.. లేక కేసీఆర్ ని కూడా అన్నాడుగా అని సరిపెట్టుకుంటారా అన్నది వేచి చూడాల ని అంటున్నారు పరిశీలకులు.