ఆదిపురుష్ CBFC సర్టిఫికేషన్ రద్దు.. షాకిచ్చిన సుప్రీం!
ఓం రౌత్ `ఆదిపురుష్` విడుదలైంది.. ఆడింది.. వెళ్లింది..! కానీ వివాదాలు మాత్రం సమసిపోలేదు. కోర్టుల పరిధిలో విచారణలు సాగుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 22 July 2023 4:40 PM GMTఓం రౌత్ `ఆదిపురుష్` విడుదలైంది.. ఆడింది.. వెళ్లింది..! కానీ వివాదాలు మాత్రం సమసిపోలేదు. కోర్టుల పరిధిలో విచారణలు సాగుతూనే ఉన్నాయి. `ఆదిపురుష్` పౌరాణిక ఇతిహాసం రామాయణాన్ని అందులో పాత్రలను వక్రీకరించిందనే ఆరోపణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి కొందరు హిందూవాదుల నుండి ఎదురుదెబ్బలు తింది. ఈ నేపథ్యంలో సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
అయితే ఈ పిటిషన్ కి ఇప్పుడు సుప్రీంలో ఎదురు దెబ్బతగిలింది. ఇది ఆదిపురుష్ టీమ్ కి పెద్ద ఊరట. ఆదిపురుష్ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వాలన్న సిబిఎఫ్.సి నిర్ణయంపై జోక్యం చేసుకునేందుకు కోర్టు మొగ్గు చూపడం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు శుక్రవారం పిటిషన్ ను తిరస్కరించింది. ``ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ మొత్తుకుంటున్నారు... సినిమాలు.. పుస్తకాల పట్ల సహనం తగ్గిపోతోంది`` అని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారని ఓ వార్తాకథనం ఉటంకించింది. ఆదిపురుష్ లో రామాయణాన్ని వర్ణించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న అలహాబాద్ హైకోర్టు విచారణపై స్టే విధించిందని నివేదిక పేర్కొంది. జూలై 27న తమ ముందు హాజరుకావాలని చిత్ర నిర్మాతలను హైకోర్టు గతంలో ఆదేశించింది.
ఈ నెల ప్రారంభంలో `ఆదిపురుష్` రచయిత మనోజ్ ముంతాషిర్ కూడా ఈ చిత్రం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అంగీకరించారు. అతను బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ``ఆదిపురుష్ వల్ల ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. రెండు చేతులు జోడిస్తూ నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. ప్రభు బజరంగ్ బలి మమ్మల్ని ఐక్యంగా ఉంచి మన పవిత్రమైన సనాతన విధానం.. మన గొప్ప దేశానికి సేవ చేసే శక్తిని ప్రసాదించుగాక`` అని వ్యాఖ్యను జోడించారు. ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, సన్నీ సింగ్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు.