సె*క్స్ వీడియోలు.. మాజీ ఎంపీకి మరో దిమ్మతిరిగే షాక్!
మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన వేలాది సె*క్స్ వీడియోలు పార్లమెంటు ఎన్నికల ముందు కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Jun 2024 12:30 PM GMTమాజీ ప్రధాని దేవగౌడ మనుమడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన వేలాది సె*క్స్ వీడియోలు పార్లమెంటు ఎన్నికల ముందు కర్ణాటక వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సహాయం కోసం తన దగ్గరకు వచ్చే మహిళలపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం చేసి.. వాటిని వీడియోలు తీసుకునేవాడని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి.
ఈ క్రమంలో విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ స్వదేశానికి రాగానే అతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎయిర్ పోర్టులోనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ప్రజ్వల్ రేవణ్ణ కాకుండే అతడి తల్లి భవానీపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు ఇవి చాలవన్నట్టు ప్రజ్వల రేవణ్ణపై మరో కేసు నమోదయింది. ఇది కూడా లైంగిక వేధింపులకు సంబంధించిందే కావడం గమనార్హం. ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసినప్పటి నుంచి కర్ణాటక వ్యాప్తంగా పలువురు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి అతడు తమపై సాగించిన అత్యాచారాలను, వేధింపులను ఏకరవు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఒక మహిళ ఫిర్యాదు మేరకు బెంగళూరు సైబర్ క్రై మ్ పోలీస్ స్టేషన్ లో ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. కాగా అతడిని విచారించేందుకు నాలుగు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజ్వల్ ను సిట్ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీపై మరో ఫిర్యాదు దాఖలైందని న్యాయమూర్తి.. ప్రజ్వల్ కు తెలిపారు.
కాగా ప్రజ్వల్ రేవణ్ణను విచారించి స్పాట్ లో అతని స్టేట్‌మెంట్ దాఖలు చేయాల్సి ఉందని సిట్ పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. ఈ మేరకు అతడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అయితే దీనిపై ప్రజ్వల్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజ్వల్ ను సిట్ కస్టడీకి ఇవ్వవద్దని విన్నవించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన క్లయింట్ పై సిట్ కేసులు నమోదు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీకి అప్పగించారు. నాలుగు రోజుల విచారణ తర్వాత మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో జూన్ 29వ తేదీ వరకు సిట్ కస్టడీలో ప్రజ్వల్ రేవణ్ణ ఉండనున్నారు. దీంతో సిట్ విచారణలో ఇంకెన్ని సంచలన విషయాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.