Begin typing your search above and press return to search.

"కొడుకులతో పాటు కూతుళ్లు ఎప్పటికీ తల్లితండ్రుల కుటుంబంలో భాగమే!"

వివరాళ్లోకి వెళ్తే... జగదీష్ అనే వ్యక్తి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వీపర్ గా పనిచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2024 4:17 AM GMT
కొడుకులతో పాటు కూతుళ్లు  ఎప్పటికీ తల్లితండ్రుల కుటుంబంలో భాగమే!
X

ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని.. ఒకసారి వివాహం అయిన తర్వాత ఆమెకు ఇక తల్లితండ్రుల కుటుంబంలో హక్కులు ఉండవని.. ఆమె పుట్టింటికి పండుగల వేళ చుట్టంచూపే అని వినిపించే వ్యాఖ్యలకు తాజాగా హైకోర్టు షాకిచ్చింది. వివాహం అయినా, కాకున్నా కుమారుడితోపాటు కుమార్తె కూడా ఆమె తల్లితండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

అవును... పెళ్లైందన్న కారణంతో కూతురిని.. ఆమె తల్లితండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గమని.. తల్లితండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఆమె నుంచి దూరం చేయడానికి వీలు లేదని.. కారుణ్య నియామక వ్యవహారాల్లో పెళ్లైన కొడుకు విషయంలో లేని ఇబ్బంది. వివాహమైన కుమార్తె విషయంలో చూపడం ఏమిటని కోర్టు వ్యాఖ్యానించింది.

వివరాళ్లోకి వెళ్తే... జగదీష్ అనే వ్యక్తి విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వీపర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు మోహన, అమ్ములు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే... 2013 జూన్ 24న జగదీష్ కన్నుమూశారు. ఈ సమయంలో... తన తండ్రి నిర్వహించిన స్వీపర్ పోస్టును కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని అమ్ములు ఈవోకి వినతిపత్రం ఇచ్చారు.

అయితే... కోర్టు నుంచి విడాకుల పత్రం తీసుకురావాలని ఈ సందర్భంగా అమ్ములుకు ఆ దేవస్థానం ఈవో సూచించారు. అయితే... తన భర్త ఎక్కడున్నారో తెలియడం లేదని.. తన తండ్రి స్వీపర్ పోస్ట్ తనకు ఇవ్వాలని ఆమె మరోసారి విన్నవించారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో ఆమె 2021లో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సమయంలో.. ఆమెకు వివాహమైందని.. ఆమె తన తండ్రితో కలిసి ఉండటం లేదని.. భర్తతో విడాకులు తీసుకున్నట్లు చెబుతున్నారే కానీ ఆ విడాకుల పత్రాన్ని చూపడం లేదని.. అందువల్లే ఆమె పిటిషన్ ను తిరస్కరించినట్లు తెలిపారు. పైగా తన భర్త 2020లో కన్నుమూశారని ఆమె ధృవపత్రం సమర్పించారని.. అంటే తన తండ్రి 2013లో మరణించేనాటికి ఆయనపై ఈమె ఆధారపడి లేదని తెలుస్తోందని అన్నారు!

దీనిపై స్పందించిన అమ్ములు తరుపు న్యాయవాది... 1999లో ప్రభుత్వ జారీ చేసిన జీవో 350 ప్రకారం వివాహిత కుమార్తె.. కారుణ్య నియామకానికి అర్హురాలేనని.. పైగా పిటిషనర్ భర్త సైతం మరణించారని.. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని పిటిషనర్ కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... 1999లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 350 ప్రకారం వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే కారుణ్య నియామక ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అమ్ములుకు 8 వారాలుగా ఉద్యోగమివ్వాలని అధికారులను ఆదేశించిన కొర్టు... కారుణ్య నిమాయకాల అమలు విషయంలో వివాహమైన కుమారుడి విషయంలో లేని అనర్హత, అభ్యంతరాలు.. వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షే నని స్పష్టం చేశారు!