సోషల్ మీడియాలో పోస్టులపై పిల్... హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Nov 2024 10:31 AM GMTసోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తారతమ్యాలు లేవని.. ఎవరినీ ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కెసులు పెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై జర్నలిస్టు విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యవహారంపై పిల్ దాఖలు చేయడంపై స్పందించిన హైకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది!
ఈ స్థాయిలో పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు చట్టనిబంధనల్కు అనుగుణంగా వ్యవహరిస్తుంటే.. తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యలు చేసింది ఉన్నత న్యాయస్థానం! ఈ సందర్భంగా.. పిల్ కు సంబంధించి తగిన ఉత్తర్వ్యులు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఒకవేళ పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
కాగా.. గత కొన్ని రోజులుగా ఏపీ పోలీసులు సోషల్ మీడియా వేదికగా అసహ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకొంటున్న సంగతి తెల్సిందే. వీరిపై వరుసగా కేసులు నమోదు చేస్తూ పలువురుని అరెస్ట్ చేసింది. మరికొందరిని విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే... వీరిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారని అంటున్నారు.