''మహిళలకే కాదు.. పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయి''.. హైకోర్టు వ్యాఖ్యలు!
ఈ క్రమంలో దర్శకుడు బాలచంద్ర మేనన్ పై ఓ నటి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 11 Dec 2024 11:30 PM GMTమలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళల స్థితిగతులపై ఈ కమిటీ నివేదిక వైరల్ గా మారింది. ఈ సమయంలో అనేక మంది నటీమణులు.. గతంలో తామూ వేధింపులు ఎదుర్కొన్నామంటూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో దర్శకుడు బాలచంద్ర మేనన్ పై ఓ నటి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
ఇందులో భాగంగా.. 2007లో ఓ సినిమా షూటింగ్ లో దర్శకుడు బాలచంద్ర మేనన్.. తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో... పలు సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదైంది. దీంతో.. 17 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, కేవలం తన ప్రతిష్టను దెబ్బతీయడమే వారి ఉద్దేశ్యమని మెనన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2007లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడమ్ వెనుక వారి ఉద్దేశ్యం ఇదే అని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సమయంలో ఈ పిటిషన్స్ ని విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్... కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మహిళలకే కాదు.. పురుషులకూ గౌరవ మర్యాదలు ఉంటాయని పేర్కొన్నారు.
అవును... ఈ వ్యవహారంపై విచారించిన జస్టిస్ కున్హికృష్ణన్.. నటుడి వాదనలో బలం ఉందని అన్నారు. సుమారూ 40 సినిమాలకు దర్శకత్వం వహించి, రెండు జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించిందని అన్నారు. 17 ఏళ్ల తర్వాత నమోదైన కేసుపై విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే... గౌరవ మర్యాదలు అనేవి కేవలం మహిళలకే కాకుండా పురుషులకూ ఉంటాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని న్యాయమూర్తి అన్నారు. ఇదే సమయంలో... పిటిషనర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పారు. కేసుకు సంబంధించి విచారణ అధికారి మూందు హాజరుకావాలని మేనన్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా... కేసు దర్యాప్తు తర్వాత ఒకవేళ మేనన్ ను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి ప్రతిపాదిస్తే.. రూ.50 వేల బాండు, ఇద్దరు పూచీకత్తుతో అతడిని విడుదల చేయాలని ఆదేశించారు.
కాగా.... జస్టిస్ హేమా కమిటీ నివేదిక వెలువడిన నేపథ్యంలో ఫిర్యాదుదరుడు మీనన్ పై ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఆమె ఫిర్యాదు ఆదారంగా... ఐపీసీ లోని సెక్షన్ 354, 509, 509 కింద మీనన్ పై ఎఫ్.ఐ.ఆర్. నమోదైంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న అరెస్ట్ చేయకుండా కోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది.