భార్యతో అసహజ శృంగారం.. ఆమె మృతి.. హైకోర్టు కీలక తీర్పు!
ఒకప్పుడు నాలుగు గోడల మధ్య, కుటుంబంలోని నలుగురు మధ్య మాత్రమే ఉండే సంసార విషయాలు ఇటీవల కాలంలో రోడ్డెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Feb 2025 7:20 AM GMTఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా జరిగే కాపురాలు ఇప్పుడు రోడ్డుకెక్కుతున్నాయని.. ఆ విషయంలో ఎవరు ఏమాత్రం ఇబ్బంది పడటం లేదని.. గుట్టుగా సాగాల్సిన సంసారం రోడ్డెక్కినా దాన్ని పెద్ద విషయంగా చాలా మంది పరిగణలోకి తీసుకోవడం లేదనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఒకప్పుడు నాలుగు గోడల మధ్య, కుటుంబంలోని నలుగురు మధ్య మాత్రమే ఉండే సంసార విషయాలు ఇటీవల కాలంలో రోడ్డెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. భార్య అనుమతి లేకుండా ఆమెతో అసహజ శృంగారానికి పాల్పడటం నేరం కిందకి రాదని ఛత్తీస్ గఢ్ హైకోర్టు పేర్కొంది.
వివరాల్లోకి వెళ్తే... భార్యతో అసహజ శృంగారం చేయడం, ఆ తర్వాత ఆమె మరణించడంతో బస్తర్ జిల్లాకు చెందిన వ్యక్తిని 2017లో పోలీసులు అరెస్ట్ చేశారు.. కేసు పెట్టారు. ఈ సందర్భంగా... మెజిస్ట్రేట్ ఎదుట ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా జగదల్ పూర్ లోని అడిషనల్ సెషన్స్ జడ్జ్.. అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
దీంతో... ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు సదరు వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ ధర్మాసనం విచారించింది. తాజాగా దీనిపై తీర్పు ఇచ్చింది. ఇందులో భాగంగా... 2013 ఐపీసీ సెక్షన్ 375కి చేసిన సవరణ ప్రకారం నిందితుడి చర్యను నేరంగా పరిగణించలేమని తెలిపింది.
ఇదే సమయంలో... భార్య వయసు 15 ఏళ్లు దాటి ఉన్నప్పుడు భర్త చేసే ఎలాంటి లైంగిక చర్య అయినా అత్యాచారం కిందకు రాదని.. ఇక సమ్మతి అనేదానికి ప్రాధాన్యం లేదని వివరించింది. ఇదే సమయంలో.. నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో... ఈ తీర్పు సంచలనంగా మారింది.