కుర్కురే కొనివ్వలేదని భర్తకు విడాకులు !
భర్త కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని ఓ భార్య ఏకంగా విడాకుల నోటీసు పంపించింది. గత ఏడాది వారిద్దరికి వివాహం అయింది
By: Tupaki Desk | 15 May 2024 2:30 AM GMTభర్త కుర్కురే ప్యాకెట్ కొనివ్వలేదని ఓ భార్య ఏకంగా విడాకుల నోటీసు పంపించింది. గత ఏడాది వారిద్దరికి వివాహం అయింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. భార్య అడగకుండానే అన్నీ కొనిచ్చి ప్రేమగా చూసుకున్నాడు. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు భార్యకు నచ్చిన తినుబండారాలను తీసుకొచ్చేవాడు. ఇప్పుడు అదే ఆ సంసారంలో నిప్పు పెట్టింది. అయితే ఈ మధ్య భర్త ఎలాంటి తినుబండారాలు ఇంటికి తీసుకురావడం లేదని దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోంది.
ఐదు రూపాయల కుర్కురే తీసుకురాలేవంటూ భర్తతో భార్య గొడవ పడుతుంది. ఎంత చెప్పినా స్నాక్స్ తీసుకురావడం లేదని విసుగెత్తిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా భర్తకు విడాకుల నోటీసు పంపించింది.
ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకూ దారితీసింద. తన భార్య పోరు భరించలేకపోతున్నానని.. రోజూ కుర్కురే తీసుకురావాలని గొడవ చేస్తుందని బాధితుడు పోలీసుల ముందు మొరపెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. కుటుంబ సలహా కేంద్రం వారు.. జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరిలో మార్పు కనిపించలేదు. మరోసారి రావాలని పోలీసులు ఇంటికి పంపించారు. ఇంతలోనే ఆమె విడాకులకు అప్లై చేసింది.
ఆమెకు కుర్కురే అంటే విపరీతమైన ఇష్టమని, పెళ్లైన కొత్తలో భర్త.. రోజూ తెచ్చేవాడని.. ఇప్పుడు తీసుకురాకపోవడం వల్లే సంసారంలో గొడవలు మొదలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.