Begin typing your search above and press return to search.

ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తన్న ఖైదీకి సైతం సంతానోత్పత్తి హక్కను కాదనలేమంటూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది.

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:39 AM GMT
ఖైదీలకు సంతానోత్పత్తి హక్కు.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
X

జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తన్న ఖైదీకి సైతం సంతానోత్పత్తి హక్కను కాదనలేమంటూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. అంతేకాదు... అందుకు తగ్గట్లు అతనికి నాలుగు వారాల పెరోల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తమ వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలందరికి ఉంటుందన్న హైకోర్టు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒక హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వ్యక్తికి నాలుగు వారాల పాటు పెరోల్ ను మంజూరు చేశారు.

తన భర్త ద్వారా తాను సంతానాన్ని పొందే అవకాశం ఇవ్వాలని అతడి భార్య అభ్యర్థిస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. హత్య కేసులో నిందితుడిగా జైలుకు వచ్చి.. అతడి నేరం నిరూపితం కావటంతో జీవితఖైదు విధించారు. దీంతో గడిచిన 14ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి 41 ఏళ్లు కాగా.. అతడి భార్యకు 38 ఏళ్లు. ఈ క్రమంలో తన భర్తతో తనకు సంతానోత్పత్తి హక్కు పొందేందుకు వీలుగా పెరోల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు.

తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును కాదనలేమని.. అందుకు ప్రభుత్వం అడ్డుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం భర్త వయసు 41 ఏళ్లు కావటంతో.. శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని.. వయోభారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని కోర్టు అభిప్రాయ పడింది.తాజా కేసులో పూర్వపరాల్నిపరిశీలించిన న్యాయస్థానం ఖైదీకి తాము దాంప్యత జీవనం కోసం అనుమతి ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. ఖైదీకి తన వంశాన్ని నిలుపుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లుగా వెల్లడించింది.

ఖైదీ ఇప్పటికే పద్నాలుగేళ్లుగా జైల్లో ఉండటం.. మరికొన్ని ఏళ్లు జైల్లోనే ఉండాల్సి రావటంతో.. అతడికి నాలుగు వారాలపెరోల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ.20వేలకు వ్యక్తిగత బాండ్లు.. ఒకరి పూచీకత్తు ఇవ్వాలన్న షరతును విధించింది. ఈ తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.