Begin typing your search above and press return to search.

మీడియాకు తప్పనిసరిగా లక్షణరేఖ... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంటూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   9 Nov 2024 4:23 AM GMT
మీడియాకు తప్పనిసరిగా లక్షణరేఖ...  హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం జరుగుతున్న విచారణలు, క్రిమినల్ కేసులపై నివేదికలు ఇవ్వడానికి మీడియా సంస్థలు తప్పనిసరిగా దర్యాప్తు అధికారులు లేదా న్యాయ ఆధికారుల పాత్రను తీసుకోకూడదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ అంటూ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం వాక్ స్వాతంత్రం, భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమికమైనప్పటికీ.. చట్టపరమైన తీర్పు వచ్చేలోపు నిందితుడి నేరాన్ని లేదా నిర్ధిషిని ప్రకటించడానికి మీడియాకు లైసెన్స్ ఇవ్వదు అని.. జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్, జస్టిస్ మహమద్ నియాస్, జస్టిస్ సీఎస్ సుధ, జస్టిస్ శ్యాం కుమార్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇదే సమయంలో.. మీడియా ద్వారా జరిగే విచారణ ప్రజాభిప్రాయాన్ని అన్యాయంగా ప్రభావితం చేస్తుందని, అనుమానితులపై ముందస్తు తీర్పుకి దారి తీస్తుందని హైకోర్టు ఎత్తి చూపింది. క్రిమినల్ ట్రయల్స్ కు సంబంధించిన నిజమైన సంఘటనలను నివేదించే హక్కు మీడియాకు ఉన్నప్పటికీ.. అది దర్యాప్తు సంస్థలు లేదా కోర్టుల పరిధిలోకి ప్రవేశించకూడదని చెప్పింది.

ఇదే క్రమంలో... న్యాయప్రక్రియ సమగ్రతను, ప్రమేయం ఉన్న వక్తులందరి హక్కులను కాపాడేందుకు.. న్యాయ విచారణల నిష్పాక్షికతను ప్రభావితం చేసే కేసుకు సంబంధించిన ఆ అంశాల గురించి మీడియా నివేదించడం మానుకోవాలని.. అర్ధ సత్యాలు, తప్పుడు సమాచరం పునాది కాకూడదని పేర్కొంది.

కొనసాగుతున్న విచారణలు, విచారణలపై మీడియా రిపోర్టింగ్ ను సవాల్ చేసిన మూడు రిట్ పిటిషన్లపై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. సెంటర్ ఫర్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్, కేరళకు చెందిన పబ్లిక్ ఐ అనే సంస్థ నుంచి డెజో కప్పన్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఇదే సమయంలో జూలై 2016లో బార్, మీడియా మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ఏర్పదిన పిటిషన్ ను కోర్టు స్వీకరించింది.

ఈ నేపథ్యంలోనే... సమాజం పట్ల తనకున్న బాధ్యతను మీడియా గ్రహించి.. న్యాయవ్యవస్థ, దర్యాప్తు సంస్థ డొమైన్ లోకి ప్రవేశించకుండా "లక్షణ రేఖ" ను స్వయంగా ఏర్పరచుకోవడం మంచింది.. ఇదే సమయంలో.. మీడియా విచారణ చేపట్టకుండా చూసుకోవాలి అని వ్యాఖ్యానించింది!