Begin typing your search above and press return to search.

మోహన్ బాబు కోసం గూగుల్ కు హైకోర్టు ఆదేశాలు!

సోషల్ మీడియాలో సినీనటుడు మోహన్ బాబు పేరును దుర్వినియోగం చేయకుండా ఆయన వ్యక్తిగత, ప్రచార హక్కులకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 4:37 AM GMT
మోహన్ బాబు కోసం గూగుల్ కు హైకోర్టు ఆదేశాలు!
X

జల్ పల్లి లోని తన నివాసంలో జరిగిన వ్యవహారాల్లో ఒక జర్నలిస్టుపై దాడి చేశారంటూ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. అయితే.. మరో విషయంలో ఢిల్లీ హైకోర్టులో మాత్రం బిగ్ రిలీఫ్ దక్కింది.

అవును... సోషల్ మీడియాలో సినీనటుడు మోహన్ బాబు పేరును దుర్వినియోగం చేయకుండా ఆయన వ్యక్తిగత, ప్రచార హక్కులకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది.

తన పేరు, స్వరం, ఫోటోలను తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత హక్కులకు, ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ వాడుకుంటున్నారని మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... సోషల్ మీడియా అకౌంట్స్, ఈ-కామర్స్ వెబ్ సైట్స్, ఏఐ చాట్ బాట్స్ లు ఆయన పేరు, ఫోటో, స్వరం లను ఉపయొగించే విషయంలో సంయమనం కోర్టు తెలిపింది.

ఈ మేరకు.. దీనిపై విచారణ అనంతరం జస్టిస్ మినీ పుష్కరణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో.. మోహన్ బాబు వ్యక్తిగత హక్కులు దుర్వినియోగం కాకుండా ఉత్తర్వ్యులు ఇవ్వకపోతే ఆయనకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ ఎటువంటి వస్తువులు విక్రయించరాదని తెలిపింది.

ఇదే సమయంలో గూగుల్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొంటూ ఆయన చేసిన ఫిర్యాదులపై గూగుల్ వెంటనే స్పందించాలని.. ఆ కంటెంట్ ను తొలగించాలని ఆదేశించింది. ఇక.. తదుపరి విచరాణ వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు!