10 ఎకరాలు.. రూ.400 కోట్ల ఫాం హౌస్.. 2 రోజుల్లో నేలమట్టం
అయితే, ఈ ఫామ్ హౌస్ ను శుక్ర, శనివారాల్లో అధికారులు కూల్చేశారు. పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఈ ఫామ్ హౌస్ అక్రమం అని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు పేర్కొంటున్నారు.
By: Tupaki Desk | 3 March 2024 2:30 PM GMTఢిల్లీ అంటే ఒక మూడు దశాబ్దాల కిందట క్రైం రేట్ అధికంగా ఉండే ప్రాంతం. రాత్రి ఏడు దాటితే దుకాణాలు బంద్.. దేశ రాజధాని అయినా.. ఆర్గనైజ్డ్ క్రైం ఎక్కువగా జరిగేది. అలాంటిది కాలంతో పాటే పరిస్థితులు మారాయి... కానీ, ఎక్కడైనా మాఫియా మాత్రం అలాగే ఉంటుంది. ఢిల్లీ పొరుగున ఉన్న యూపీ అసలే అనేక రకాల మాఫియాకు కేంద్రం. హరియాణ, పంజాబ్ కూడా.. ఇప్పుడు ఇలాంటి లిక్కర్ మాఫియా అధినేత ఫామ్ హౌస్ కూల్చివేత అత్యంత చర్చనీయాంశం అవుతోంది.
ఆయన యూపీ లిక్కర్ కింగ్..పాంటీ చద్దా.. అలియాస్ గుర్దీప్ సింగ్.. యూపీలో లిక్కడర్ డాన్. దీనికితోడు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ ఉన్నారు. ఆయన కుటుంబానికి డిల్లీ ఛత్రపూర్ ఏరియాలో ఫామ్ హౌస్ ఉంది. పది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫామ్ హౌస్ విలువు రూ.400 కోట్ల పైమాటే అని చెబుతున్నారు. అంటే ఎకరం రూ.40 కోట్లు కింద లెక్కగట్టారు.
అయితే, ఈ ఫామ్ హౌస్ ను శుక్ర, శనివారాల్లో అధికారులు కూల్చేశారు. పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఈ ఫామ్ హౌస్ అక్రమం అని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) అధికారులు పేర్కొంటున్నారు. దీంతో డీడీఏ సిబ్బంది సామగ్రితో తరలివచ్చి ఫాంహౌస్ ను నేలమట్టం చేశారు.
ప్రభుత్వ భూమిని ఆక్రమించి..పాంటీ చద్దా ఫాం హౌస్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినదిగా చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఆ ఫాంహౌస్ పాంటీ చద్దా కుమారుడు మన్‌ప్రీత్ అలియాస్ మాంటీ కబ్జాలో ఉంది. పాంటీ, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ మధ్య ఇక్కడ గొడవ జరిగింది. దీంతో హర్దీప్ తుపాకీతో పాంటీని కాల్చి చంపాడు. తర్వాత పాంటీ అంగరక్షకుడు హర్దీప్ ను కాల్చేశాడు. కాగా, ఢిల్లీ వంటి నగరంలో లేదా దాని సమీపంలో 10 ఎకరాల్లో ఫాంహౌస్ అక్రమంగా ఉంటే ఇన్నాళ్లూ అధికారులు ఏం చేశారనేది ప్రశ్న. ఇక పాంటీ ఫాంహౌస్ లో శుక్రవారం ఐదు ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ప్రధాన బిల్డింగ్ నూ కూల్చివేశారు. మొత్తం భూమిని ఆధీనంలోకి తీసుకున్నారు.
ఇందులో గార్డెన్, ఔట్ హౌస్, ప్రధాన భవనం ఉన్నాయి. కాగా, చడ్డాకు వేవ్ గ్రూప్ తమ ఫాం హౌస్ కూల్చివేతపై స్పందించలేదు. ఇదే గ్రూప్ నకు యూపీ లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉంది. ఈ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.