బ్రేకింగ్... లిక్కర్ స్కాం కేసులో కవితకు బిగ్ షాక్!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్యపరిణామాలు తెరపైకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 6 May 2024 7:50 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్యపరిణామాలు తెరపైకి వస్తున్నాయి. వరుస అరెస్టులు, విచారణలతో ఈ విషయం హాట్ టాపిక్ గా ఉంది. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. దీంతో... ఆమె బెయిల్ పై బయటకు ఎప్పుడు వస్తారనే విషయంలో తీవ్ర సందిగ్ధత నెలకొందని అంటున్నారు.
అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బెయిల్ పై నేడు తీర్పు వెలువడింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో ఈడీ, సీబీఐ వాదనలు ముగిశాయి. దీంతో... ఈరోజు కవిత బెయిల్ పై రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువడించారు. ఇందులో భాగంగా... కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించింది.
ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న కవిత... తన బెయిల్ పిటిషన్ లో భాగంగా.. స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కోర్టుకు తెలిపారని తెలుస్తుంది. మహిళగా పీ.ఎం.ఎల్.ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపినట్లు సమాచారం! అయితే... కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ తమ వాదనలు వినిపించినట్లు చెబుతున్నారు.
కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో... రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో... కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.