Begin typing your search above and press return to search.

‘భార్య పోర్న్ వీడియోలు చూస్తుంటే?’... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2018లో వివాహం చేసుకున్నాడు. అయితే 2020 డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   21 March 2025 4:00 AM IST
‘భార్య పోర్న్ వీడియోలు చూస్తుంటే?’... హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

తమిళనాడులోని కరూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 2018లో వివాహం చేసుకున్నాడు. అయితే 2020 డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ సందర్భంగా... భార్య పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తోందని.. తరచూ హస్తప్రయోగం చేస్తూ క్రూరత్వం ప్రదర్శిస్తోందని ఆమె భర్త విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... భార్య పోర్న్ వీడియోలకు బానిసగా మారిందనే కారణంతో విడాకులు మంజూరు చేయలేమని మద్రాసు హైకోర్టు తాజాగా సంచలన తీర్పు చెప్పింది! ఇదే సమయంలో... వివాహం అయినంత మాత్రాన్న మహిళలు తమ లైంగిక స్వయంప్రతిపత్తిని వదులుకోరని.. హస్తప్రయోగం వంటి హక్కు వారికీ ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ కారణాలతో తన విడాకుల అభ్యర్థనను కింది కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సదరు వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా భర్త చేసిన అప్పీల్ ను తోసిపుచ్చిన జస్టిస్ స్వామినాథన్, జస్టిస్ పూర్ణిమల ధర్మాసనం.. స్వీయ అనందం నిషేధితం కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... మగవాళ్లలో హస్తప్రయోగం సార్వత్రికమైందనప్పుడు.. మహిళలకు మాత్రం ఈ విషయంలో కళంకాన్ని ఆపాదించడం తగదని తీర్పులో పేర్కొంది! అయితే... పోర్న్ వీడియోలకు బానిసగా మారడం మాత్రం చెడ్డ అలవాటేనని.. దీన్ని నైతికంగా సమర్ధించలేము కానీ.. ఈ కారణంతో విడాకులు మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది.

అదేవిధంగా... భార్య ప్రైవేట్ గా పోర్న్ చూసినంత మాత్రాన్న దాన్ని వైవాహిక కూరత్వంగా పరిగణించలేమని.. అయితే, పోర్న్ చూసే వ్యక్తి తన జీవిత భాగస్వామిని తనతో లేదా ఆమెతో అలా చేయమని, చేరమని బలవంతం చేస్తే మాత్రం అది ఖచ్చితంగా క్రూరత్వం అవుతుందని.. మద్రాసు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే... ఈ వ్యసనం వల్ల వైవాహిక బాధ్యతలపై ప్రతికూల ప్రభావం ఉందని రుజువుచేయగలిగితే తప్ప.. ప్రైవేట్ గా పోర్న్ చూస్తున్న కారణంగా విడాకులు మంజూరు చేయలేమని ధర్మాసనం పేర్కొంది.