జయలలిత ఎస్టేట్ లో హత్య కేసు... మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు!
వారిద్దరినీ విచారించకుండా గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
By: Tupaki Desk | 6 Dec 2024 10:30 PM GMTకొడనాడు హత్య, దోపిడీ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందనే సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా మద్రాసు హైకోర్టులో కీలక పరిణాం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ప్రతిపక్ష ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి, శశికళ తదితరులను విచారించేందుకు సీబీసీఇడీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. వారిద్దరినీ విచారించకుండా గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.
అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొడనాడు హత్య, దోపిడీ కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా... పళనిస్వామి, శశికళలను విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం సీబీసీఐడీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. గతంలో ఊటీఇలోని జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. దీంతో... ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ లో 2017లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి.. అక్కడున్న కాపలాదారుడు ఓం బహదూర్ ను హత్య చేసి, అక్కడున్న పలు వస్తువులను దోచుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ హత్య, దోపిడీ కేసుపై తొలుత పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు ఐదేళ్ల పాటు దర్యాప్తు జరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
అయితే ప్రభుత్వ దాటిన తర్వాత కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. దీంతో.. ఈ కేసులో ఇప్పటివరకూ 10 మందిని అరెస్ట్ చేయగా.. సుమారు 100 మందిని విచారించారు. వాస్తవానికి ఈ కేసులో పళనిస్వామి, శశికళను విచారించేందుకు గతంలో దిగువ కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో... సీబీసీఐడీ మద్రాస్ హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో సీబీసీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు పళనిస్వామి, శశికళల విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో... తర్వాత పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొందని అంటున్నారు.