Begin typing your search above and press return to search.

వ్యభిచార గృహానికి రక్షణ కోరిన లాయర్... పోలీసులను ఆపాలని పిటిషన్!

ఈ నేపథ్యంలో తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.

By:  Tupaki Desk   |   26 July 2024 10:24 AM GMT
వ్యభిచార గృహానికి  రక్షణ కోరిన లాయర్... పోలీసులను ఆపాలని పిటిషన్!
X

తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న తన వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పైగా... తాము పరస్పర సమ్మతితో సె*క్స్ సర్వీస్ అందిస్తున్నామనే వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఈ పిటిషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. అనంతరం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... తన వ్యభిచార గృహానికి సెక్యూరిటీ కల్పించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఓ న్యాయవాది. పైగా... తనపై నమోదైన కేసులు కొట్టివేస్తూ, తన వ్యాపారం జోలికి రాకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. దీంతో... సీరియస్ గా రియాక్ట్ అయిన కోర్టు పిటిషన్ ను రద్దుచేసి ఫైన్ విధించింది.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మేజర్ లు ఏకాభిప్రాయంతో సె*క్స్ చేయడం చట్టవిరుద్దం కాదంటూ పిటిషన్ తన వాదన వినిపించాడు.

ఈ నేపథ్యంలో తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీంతో... వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా.. తన చర్యలను నిస్సిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ పుగలేంధీ ధర్మాసనం సదరు పిటిషన్ పై మండిపడింది.

ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు న్యాయవాదిని 10వేల జరిమానా కూడా విధించింది. ఈ సందర్భంగా... సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందనే విషయం బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని.. కనీసం ఇకనుంచైనా పేరున్న కళాశాలల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకునేలా చూసుకోవాలని కోరింది.