Begin typing your search above and press return to search.

నోరు జారిన నటుడికి మద్రాసు హైకోర్టు జైలుశిక్ష

నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ కొందరు తమ నోటికి అవసరానికి మించి పని చెబుతుంటారు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:30 AM GMT
నోరు జారిన నటుడికి మద్రాసు హైకోర్టు జైలుశిక్ష
X

నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ కొందరు తమ నోటికి అవసరానికి మించి పని చెబుతుంటారు. అలాంటి తప్పే చేసిన తమిళ నటుడికి తాజాగా ప్రత్యేక కోర్టు జైలుశిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నోరు జారినట్లుగా పశ్చాత్తాపం చెందుతున్నట్లుగా పేర్కొంటూ క్షమాపణ చెప్పినప్పటికీ.. శిక్షను తాజాగా ఖరారు చేశారు. తాజాగా ఇచ్చిన తీర్పును చూసినప్పుడు నోరు జారితే కలిగే నష్టం గురించి అందరికి తెలియాల్సిన అవసరం ఉంది.

2018లో తమిళ నటుడు ఎస్వీ శేఖర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దాని సారాంశం.. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు అంతా తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాల్ని పెట్టుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్టుపెట్టారు. ఇది కాస్తా పెద్ద ఎత్తున వివాదంగా మారింది. మహిళా జర్నలిస్టులు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై చెన్నై మీడియా ప్రతినిధులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ఈ అంశం కోర్టులో విచారణ సాగింది. ఈ సందర్భంగా శేఖర్ నోరు జారిన వైనాన్ని న్యాయస్థానం గుర్తించింది. సారీ చెప్పినట్లుగా పేర్కొన్నా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో వాదనలు ముగియటంతో తాజాగా తీర్పును ఇచ్చింది. శేఖర్ పై ఆరోపణలు నిజమని తేలటంతో ఆయనకు నెల రోజులు జైలుశిక్ష.. రూ.15వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పును ఇచ్చింది. అదే సమయంలో అప్పీల్ కు ఇవ్వాలని నటుడి తరఫు న్యాయవాదలు కోరగా.. శిక్షను తాత్కాలికంగా నిలుపుతూ జడ్జి ఉత్త్వులు జారీ చేశారు. అప్పీలు కోసం రెండు నుంచి నాలుగు వారాల లోపు ప్రయత్నాలు చేసుకోవాలన్నారు. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.