Begin typing your search above and press return to search.

లిక్కర్ కేస్ : బిగ్ అప్ డేట్

ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   9 Aug 2024 9:47 AM GMT
లిక్కర్ కేస్ : బిగ్ అప్ డేట్
X

ఢిల్లీ లిక్కర్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిలు లభించింది. దీంతో 17 నెలల సుధీర్ఘ జైలు జీవితం తర్వాత ఆయన బయటకు రానున్నారు.

జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసులో బెయిలుకు సంబంధించి తుది తీర్పును ఈ రోజు వెల్లడించింది. ప్రతి సోమవారం ఆయన దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని బెయిలు ఉత్తర్వులలో సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్యం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా విచారించింది. కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి ఈ రోజు వెలువరించింది.

మద్యం విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కూడా బెయిల్ లభించింది. ఆయితే ఆయనపై ఇంకో సీబీఐ కేసు ఉండడంతో ఆయన బయటకు రాలేదు. కేసు విచారణలో పురోగతి లేదని, ఒక పరిమితి దాటిన తర్వాత ఒక వ్యక్తిని జైలులోనే ఉంచలేమని, అలా జైలులో ఉంచడం అంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని ఈ సంధర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సిసోడియాకు బెయిలు రావడంతో ప్రస్తుతం ఆప్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. సిసోడియాకు బెయిలు ఇవ్వొద్దన్న దర్యాప్తు సంస్థల వాదనలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన బయటకు వెళ్తే సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు వాదించాయి. కానీ వారి వాదనను సుప్రీం సమర్ధించలేదు. మొత్తానికి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇది కీలక పరిణామం అని చెప్పాలి.