Begin typing your search above and press return to search.

మేరుగ నాగార్జున కేసులో బిగ్ ట్విస్ట్... బాధితురాలి అభ్యర్థన నిరాకరించిన కోర్టు!

ఇందులో భాగంగా... బుధవారం జరిగిన విచారణకు బాధితురాలు హైకోర్టుకు హాజరై.. నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   7 Nov 2024 4:33 AM
మేరుగ నాగార్జున కేసులో బిగ్ ట్విస్ట్... బాధితురాలి అభ్యర్థన నిరాకరించిన కోర్టు!
X

ఉద్యోగం.. లేదా, కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని చెప్పి తనవద్ద డబ్బులు తీసుకున్నారని.. అంతే కాకుండా.. లైంగికంగా వేధించారంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన ఓ మహిళ గంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.

అవును... వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై డబ్బులు తీసుకోవడంతో పాటు.. లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు చేసిన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇందులో భాగంగా... బుధవారం జరిగిన విచారణకు బాధితురాలు హైకోర్టుకు హాజరై.. నాగార్జునపై తాను తప్పుడు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.

ఇదే సమయంలో... పోలీసులు కేసు కొట్టేస్తే తనకు అభ్యంతరం లేదని ప్రమాణపత్రం దాఖలు చేశారు సదరు మహిళ. అయితే... ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సీరియస్ గా స్పందించారు! ఇందులో భాగంగా... అలా కోరగానే కేసులు కొట్టేయలేమని తెలిపారు.

ఇదే క్రమంలో.. తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తేలితే ఫిర్యాదుదారు కూడా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.. ఇటీవల కాలంలో ఫిర్యాదు చేయడం, తర్వాత కోర్టుకు వచ్చి ఆ కేసు కొట్టేయాలని కోరడాన్ని తరచూ చూస్తున్నామని అన్నారు. కేసు డైరీ, దర్యాప్తుపై స్థాయీ నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలోనే... విచారణను ఈ నెల 12కి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ సమయంలో మాజీ మంత్రి నాగార్జున తరుపు న్యాయవాది స్పందిస్తూ... తదుపరి విచారణ వరకూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వ్యులివ్వాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు.