Begin typing your search above and press return to search.

మోడీ కోర్టులను లెక్కచేయటం లేదా ?

కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ తప్పని కోర్టు చెప్పినా మోడీ పట్టించుకోవటంలేదు

By:  Tupaki Desk   |   21 July 2023 5:38 AM GMT
మోడీ కోర్టులను లెక్కచేయటం లేదా ?
X

అధికారంలో ఉన్నపుడు ప్రజాస్వామ్యం లేదు, చట్టాలు, న్యాయాలు దేన్ని పాలకులు లెక్కచేయరు. అదే ప్రతిపక్షంలోకి గానే న్యాయం,చట్టం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే 24 గంటలూ నరేంద్రమోడీ ప్రజాస్వామ్య ఔన్నత్యం, చట్టాలు, న్యాయస్ధానాల గొప్పతనం గురించే మాట్లాడుతుంటారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి దేన్నీ లెక్కచేయరు. కేంద్రప్రభుత్వంపై సుప్రింకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలను పట్టించుకోని పాలకుల తీరు చాలా బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించింది.

విషయం ఏమిటంటే ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనం చేయాలన్నది మోడీ టార్గెట్. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉండటాన్ని మోడీ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే లెఫ్ట్ నెంబ్ జనరల్(ఎల్జీ)ని ముందుపెట్టి వ్యవహారాలన్నీ మోడీయే చూస్తున్నారు.దాన్ని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో చాలెంజ్ చేశారు.

కేసును విచారించిన కోర్టు కేంద్రప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ప్రజలు ఎన్నుకున్న పార్టీదే ప్రభుత్వంలో అంతిమ నిర్ణయంగా ఉండాలని తేల్చిచెప్పింది. అయితే దాన్ని మోడీ లెక్కచేయకుండా పెత్తనమంతా కేంద్రప్రభుత్వానికే ఉండేట్లుగా ఆర్డినెన్స్ జారీచేశారు.

ఆ ఆర్డినేన్సును చాలెంజ్ చేస్తు కేజ్రీవాల్ సుప్రింకోర్టులో పిటీషన్ వేశారు. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం విచారం వ్యక్తంచేసింది. ధర్మాసనం తీర్పులను, సూచనలను పాలకులు లెక్కచేయకపోవటం చాలా బాధాకరమన్నది. రాజకీయ వైరాలను పక్కనపెట్టి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించింది. కేంద్రప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ తప్పని కోర్టు చెప్పినా మోడీ పట్టించుకోవటంలేదు.

ఆర్డినెన్సుజారీచేయటమే కాకుండా దానికి చట్టబద్దత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డినెన్సును చట్టం రూపంలోకి తేవటం కోసం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఉభయసభల్లో ప్రవేశపెట్టబోతోంది. దీనిపైనే ప్రతిపక్షాలన్నీ గోల చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలోనే ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. విచిత్రం ఏమిటంటే కేసు విచారణ ఒకవైపు కోర్టుకు చేరిన సమయంలోనే మరోవైపు బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. అంటే కోర్టు తీర్పులు, సూచనలను మోడీ ఏమాత్రం లెక్కచేయటం లేదన్న విషయం అర్ధమవుతోంది. మళ్ళీ తెల్లారి లేస్తే న్యాయం, చట్టం, ధర్మం గురించి మాట్లాడుతుంటారు.