సంచలన మర్డర్ కేసుపై వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యేనా?
ముంబై కోర్టులో నెట్ ప్లిక్స్ పై సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. ఓ హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుదల ఆపాలని కోర్టుని సీబీఐ కోరింది.
By: Tupaki Desk | 19 Feb 2024 6:33 AM GMTముంబై కోర్టులో నెట్ ప్లిక్స్ పై సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. ఓ హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ విడుదల ఆపాలని కోర్టుని సీబీఐ కోరింది. దీంతో నెట్ ప్లిక్స్ తో పాటు మరికొందరకి కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసుపై ఈనెల 20 విచారణ జరగనుంది. అనంతరమే ఆ సిరీస్ రిలీజ్ అవ్వాలా? లేదా? అన్నది క్లారిటీ వస్తుంది. ఆ పూర్తి వివరాలు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
షీనా బోరా హత్య కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ కథ ఆధారంగా `ది ఇంద్రానీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్` పేరుతో వెబ్ సిరీస్ తెరకెక్కింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 23న నెట్ ప్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సిరీస్ పై మంచి బజ్ క్రియేట్ అయింది. సంచలన అంశం కావడంతో ప్రేక్షకులు రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకూ రిలీజ్ చేయకూడదంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు నోటీసులు పంపించడం..విచారణ 20వ తేదికి వేయడంతో రిలీజ్ అవు తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ రోజు కోర్టు ఇచ్చే తీర్పును బట్టే రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఇంద్రాణీ తన కుమార్తె షీనా బోరాని డ్రైవర్ సహాయంతో హతమార్చి దాచి పెట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో? ఆ మె జైలు జీవితాన్ని చూపిస్తూ నెట్ ప్లిక్స్ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవ ఘటనలో ఇంద్రాణీ..ఆమె డ్రైవర్ శ్యాంవర్ రాయ్ మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి షీనాని కారులో గొంతుకోసి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పదేళ్లగా ఈ కేసు కోర్టులో నలుగుతోంది. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ రిలీజ్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.