Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో ఆ స్టార్ హీరో

వివాదాలు..విమ‌ర్శ‌లు కోలీవుడ్ హీరో శింబు కొత్తేం కాదు. వాటితో చెలిమి చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటైన ప‌నే.

By:  Tupaki Desk   |   11 May 2024 8:25 AM GMT
మ‌రో వివాదంలో ఆ స్టార్ హీరో
X

వివాదాలు..విమ‌ర్శ‌లు కోలీవుడ్ హీరో శింబు కొత్తేం కాదు. వాటితో చెలిమి చేయ‌డం ఆయ‌న‌కు అల‌వాటైన ప‌నే. ఇప్పుడిప్పుడే వాటికి దూర‌మ‌వుతున్నాడు. మ‌ళ్లీ గ‌త వైభవాన్ని అందుకునే లా కృష్టి చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో మ‌ణిర‌త్నం `థ‌గ్ లైప్` లో సైతం న‌టించే అవ‌కాశం అందుకున్నాడు. అయితే ఇందులో అలా ఛాన్స్ వచ్చిందో? లేదో? ఆ సినిమాలో న‌టించ‌డానికి వీలు లేదంటూ మ‌రో నిర్మాత కొర్టుకెక్కాడు. క‌ట్ చేస్తే కోటి రూపాయ‌లు పైన్ క‌ట్ట‌డ‌మా? లేదంటే నిషేధం విధించ‌డ‌మా? అంటూ కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో సీన్ రివ‌ర్స్ అయింది. వివ‌రాల్లోకి వెళ్తే.

కోలీవుడ్ నిర్మాత ఐస‌రీ గ‌ణేష్ సంస్థ‌లో `క‌రోనా కుమార్` అనే సినిమాలో శింబు న‌టించాల్సి ఉందిట‌. ఆ సినిమాకి పారితోషికంగా తొమ్మిది కోట్లకు ఒప్పందం కుద‌ర‌గా నాలుగు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాడుట‌. కానీ ఒప్పందం ప్ర‌కారం క‌రోనా కుమార్ షూటింగ్ లో పాల్గొన‌డ‌కుండా క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న `థ‌గ్ లైఫ్` షూటింగ్ కి హాజ‌రు అవ్వ‌డంతో గ‌ణేష్ నిర్మాత‌ల మండ‌లిలో ఫిర్యాదు చేసాడు. అలాగే కోర్టులో పిటీష‌న్ కూడా దాఖ‌లు చేసారు. విచార‌ణ‌లో కోర్టు శింబు కి షాక్ ఇచ్చిన‌ట్లు నిర్మాత వెల్ల‌డించారు.

సెప్టెంబ‌ర్ 19లోగా కోటి రూపాయ‌ల‌తో కూడిన అనుమ‌తి పత్రాన్ని అంద‌జేయాల‌ని, లేని ప‌క్షంలో ఇత‌ర చిత్రాల్లో న‌టించ‌కుండా నిషేధం విధిస్తామ‌ని న్యాయ స్థానం తీర్పునిచ్చింద‌న్నారు. శింబు ముందుగా క‌రోనా కుమార్ షూటింగ్ పూర్తి చేసిన త‌ర్వాతే థ‌గ్ లైఫ్ షూటింగ్ హాజ‌రు కావాల‌ని తీర్పులో పేర్కొన్న‌ట్లు నిర్మాత చెబుతున్నారు. దీంతో శింబు కొత్త చిక్కొచ్చి ప‌డిన‌ట్లు అయింది. కొన్ని రోజులుగా శింబు థ‌గ్ లైఫ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

మ‌ణిరత్నం ఆయ‌న‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. శింబు పై షూట్ కి సంబంధించి అంతా ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌ణిర‌త్నం ముందుకెళ్తున్నారు. తాజాగా కోర్టు తీర్పు నేప‌థ్యంలో ఇప్పుడా ప్లానింగ్ లో మార్పులు త‌ప్ప‌వ‌ని తెలుస్తోంది. మ‌రి ఈ తీర్పుపై శింబు పై కోర్టుకెళ్తాడా? లేక క‌రోనా కుమార్ పూర్తి చేసి థ‌గ్ లైఫ్ షూటింగ్ లో జాయిన్ అవుతాడా? అన్న‌ది చూడాలి.