Begin typing your search above and press return to search.

మంట పుట్టే తీరు: ఫ్లైట్ లో తప్పుడు పని.. కోర్టులో నిస్సిగ్గు సమర్థింపు

2022 మేలో అమెరికాలోని హోనలూలు నుంచి బోస్టన్ కు వెళ్లే ఫ్లైట్ లో ఈ ఛండలానికి తెర తీశాడు పేరున్న ఆ వైద్యుడు

By:  Tupaki Desk   |   2 Feb 2024 7:30 AM GMT
మంట పుట్టే తీరు: ఫ్లైట్ లో తప్పుడు పని.. కోర్టులో నిస్సిగ్గు సమర్థింపు
X

మనసుకు తోచింది చేసుకుంటూ పోతే.. మనిషికి.. జంతువులకు తేడా ఉంది. బుద్ది.. విచక్షణ లాంటివి ఉండే మనుషులకు భిన్నంగా ఒక ప్రముఖ వైద్యుడు వ్యవహరించిన తీరు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వైద్యుడు.. కోర్టులో నిస్సిగ్గుగా తాను చేసిన పనిని సమర్థించుకునే తీరు విస్మయానికి గురి చేస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందిన డాక్టర్ (సుదీప్త మోహంతి) విమానంలో ప్రయాణిస్తూ.. తోటి ప్రయాణికుల చెంతనే బహిరంగంగా హస్త ప్రయోగం చేసుకోవటం.. దీనిపై అందిన ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేయటం తెలిసిందే.

2022 మేలో అమెరికాలోని హోనలూలు నుంచి బోస్టన్ కు వెళ్లే ఫ్లైట్ లో ఈ ఛండలానికి తెర తీశాడు పేరున్న ఆ వైద్యుడు. అతడి సీటుకు దగ్గర్లో పద్నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. అతడి వికార చేష్టను సదరు బాలికే విమాన సిబ్బంది కంప్లైంట్ చేసింది. అతను ఓపెన్ గా హస్తప్రయోగం చేసుకున్నాడని.. తాను కంప్లైంట్ చేసే వేళ దుప్పటి కప్పుకున్నట్లుగా వాపోయింది. సిబ్బంది అతడికి చెప్పిన తర్వాత కూడా మొహంతి మరోసారి హస్తప్రయోగానికి పాల్పడటం గమనార్హం.

ఈ నేపథ్యంలో అతడి తీరుపై కేసు నమోదైంది. తాజాగా ఇది కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఉదంతం అప్పట్లో పెను సంచలనంగా మారింది. తాజాగా జరిగిన కోర్టు విచారణలో సంచలన విషయాల్ని చెప్పుకోవటమే కాదు తాను చేసిన వికారపు పనిని ఎంతలాసమర్థించుకున్నాడో అతడి వాదనను విన్నంతనే అర్థమవుతుంది. తాను చేసిన పనికి సిగ్గుపడటం.. మొహమాటపడటం లాంటివి తాను ఫీల్ కావటం లేదన్న అతడు.. అంతకు ముందు జరిగిన విచారణలో మాత్రం తాను అలా చేయలేదని చెప్పటం గమనార్హం.

తన ముందు తనకు కాబోయే భార్య కూర్చుందని.. ఆ సమయంలో తనకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ విచిత్రమైన వాదనను వినిపించాడు. అలా చేయటం వల్ల తానేమీ బాధ పడటం లేదని.. నామోషీగా ఫీల్ కావటం లేదన్న అతను.. తనను తాను భాద్యతాయుతమైన వైద్యుడిగా పేర్కొనటం విశేషం. తనపై ఇలాంటి ఆరోపణలు చేయటం సరికాదన్న బుకాయింపును ప్రదర్శించాడు. ఈ కేసులో తమ క్లయింట్ మీద తప్పుడు ఆరోపణలు చేశారంటూ వాదిస్తున్న న్యాయవాదుల వాదనకు భిన్నంగా తాజా వాదన ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఉదంతంలో అతను నేరం చేసినట్లుగా కోర్టు భావిస్తే.. అతనికి 90 రోజులు జైలుతో పాటు.. 5వేల డాలర్ల వరకు ఫైన్ పడే వీలుందని చెబుతున్నారు. మొన్నటి వరకు తాను అసలు ఆ పని ససేమిరా చేయలేన్న అతడు.. ఇప్పుడు మాత్రం అలా చేయటాన్ని తాను అస్సలు తప్పుగా ఫీల్ కావటం లేదన్న వాదనను వినిపంచటం ఆసక్తికరంగా మారింది.