అతడు నిర్దోషి.. ఏపీ యువతి హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు
దాదాపు పదేళ్ల క్రితం ఏపీకి చెందిన ఒక యువతి ముంబయికి వెళ్లటం.. ట్రైన్ దిగి తన హాస్టల్ కు వెళ్లే క్రమంలో దారుణంగా హత్యకు గురి కావటం అప్పట్లో పెను సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 29 Jan 2025 5:39 AM GMTదాదాపు పదేళ్ల క్రితం ఏపీకి చెందిన ఒక యువతి ముంబయికి వెళ్లటం.. ట్రైన్ దిగి తన హాస్టల్ కు వెళ్లే క్రమంలో దారుణంగా హత్యకు గురి కావటం అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన కేసులో తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. నిందితుడ్ని నిర్దోషిగా పేర్కొన్న వైనం సంచలనంగా మారింది. ఈ హత్య ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా ఈ దారుణ హత్య మీద చర్చ జరిగింది.
2014 జనవరి నాలుగున మచిలీపట్నానికి చెందిన ఏస్తేర్ అనూహ్య విజయవాడలోని లోక్ మాన్య తిలక్ టెర్మినస్ రైలులో బయలుదేరి వెళ్లింది. 2014 జనవరి 16న ముంబయిలోని కుంజూర్ మార్గ్ వద్ద శవమైన కనిపించింది. ఎస్తేర్ ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ముంబయికి చెందిన చంద్రభానును పోలీసులు గుర్తించారు.అతడికి 2015లో మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది.
అనంతరం ఈ కేసు అప్పీలులో భాగంగా హైకోర్టు సైతం సమర్థించింది. ఈ తీర్పులను సవాలు చేస్తూ చంద్రభాను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసును జస్టిస్ గవాయ్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా చంద్రభానే ఈ హత్యకు పాల్పడినట్లుగా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది.
ఇదే విషయాన్ని ప్రస్తావించిన అత్యున్నత న్యాయస్తానం నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడ్ని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది. దీనిపై విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసుల తీరుతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏమైనా..ఇలాంటి సంచలన హత్య కేసుల విషయంలో పోలీసులు మరింత యాక్టివ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.