Begin typing your search above and press return to search.

సుప్రీం చరిత్రలో సరికొత్త అధ్యాయం... అన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం!

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 10:30 PM GMT
సుప్రీం చరిత్రలో సరికొత్త అధ్యాయం... అన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం!
X

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... కోర్టులోని అన్ని బెంచ్ లలో జరిగే వాదనలు ప్రజలంతా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ తో ప్రయోగాత్మక పరిశీలన చేయనుంది. త్వరలోనే అధికారికంగా అన్ని బెంచ్ ల వాదనలు, తీర్పు ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా అందుబాటులోకి తేనుంది.

అవును... సుప్రీంకోర్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. ఇందులో భాగంగా... ఇకపై సుప్రీంకోర్టులో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను ట్రైల్ రన్ చేసి, ఏమైనా లోటుపాట్లుంటే వాటిని సరిచేసి త్వరలో అమలులోకి తీసుకురానుంది.

వాస్తవానికి రెండేళ్ల క్రితమే సర్వోన్నత న్యాయస్థానంలోని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా... యూట్యూబ్ వేదికగా వాటిని ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో తొలి విచారణ... మహారాష్ట్ర శివసేన పార్టీలో శిండే వర్గం తిరుగుబాటు... ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై దాఖలైన పిటిషన్ లపై జరిగింది.

కాగా... కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిర్ణయం 2018లోనే తీసుకున్నప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. అయితే... సీజేఐ గా జస్టిస్ ఎన్.వి. రమణ రిటైర్మెంట్ రోజు.. ఆయన నేతృతంలోని ధర్మాసనం కార్యకలాపాలను దేశమంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం అదే తొలిసారి.

ఈ నేపథ్యంలో ఇకపై సుప్రీంకోర్టు అన్ని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.