మత సంబంధ కట్టడాల కూల్చివేతలు... సుప్రీం కీలక వ్యాఖ్యలు!
ఇదే సమయంలో... అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా కూడా.. దానికీ, ఇంటిపై బుల్డోజర్ కూ సంబంధం లేదని అన్నారు.
By: Tupaki Desk | 1 Oct 2024 11:31 AM GMTప్రార్థనా మందిరాలు ప్రజా జీవితాలకు అడ్డంకి కాకూడదని.. మనది సెక్యులర్ దేశం అని.. ఆక్రమణల తొలగింపు, బుడ్లోజర్ తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని తాజాగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అవును... రోడ్లు, రైల్వే ట్రాక్లు, నీటివనరులను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని.. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ పై ఉత్తరప్రదేశ్, మద్యప్రదేశ్, గుజరాత్ తరుపున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా కోర్టుకు హాజరయ్యారు! ఈ సమయంలో... ఏదైనా నేరంలో ఉండటమే ఓ వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా? అని ఆయనను బెంచ్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా స్పందించిన మెహతా... "కచ్చితంగా కాదు" అని అన్నారు.
ఇదే సమయంలో... అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా కూడా.. దానికీ, ఇంటిపై బుల్డోజర్ కూ సంబంధం లేదని అన్నారు. ఒక్కరోజు ముందు ఇంటి గోడపై నోటీసు అంటించినా పరిగణలోకి తీసుకోమని తెలిపారు. ఇది ముందే జరిగి ఉంటేనే చర్యలు తీసుకొంటామని కోర్టుకు తెలిపారు.
ఈ సమయంలో స్పందించిన పిటిషనర్ల తరుపు న్యాయవాది సీయూ సింగ్ వాదిస్తూ... బుల్డోజర్ చర్యలను నేరాలపై పోరాడేందుకు ఉపయోగించకూడదని అభ్యర్థించారు.
దీనిపై న్యాయస్థానం... మనది సెక్యులర్ దేశమని.. తమ మార్గదర్శకాలు జాతిమతాలతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తాయని.. ఏదైనా మత సంబంధమైన నిర్మాణం.. రోడ్డు, ఫుట్ పాత్, రైలు పట్టా, జలాశయం పై ఉంటే అది ప్రజలకు అడ్డంకి కాదా.. అక్రమ నిర్మాణాల విషయంలో అందరికి ఒకటే చట్టం అని వ్యాఖ్యానించింది.