Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసే ముందు ఏం చేయాలో చెప్పిన సుప్రీం

ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కేంద్రానికి కీలక సూచన చేసింది.

By:  Tupaki Desk   |   4 March 2025 8:00 PM IST
సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసే ముందు ఏం చేయాలో చెప్పిన సుప్రీం
X

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తుల్లో సోషల్ మీడియా ఒకటి. అవునన్నా.. కాదన్నా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు రాజకీయ.. సామాజిక.. ఆర్థిక అంశాల్లో మార్పులకు కారణంగా మారుతున్నాయి. దీని శక్తి పెరుగుతున్న కొద్దీ ఈ వేదికల్ని దుర్వినియోగం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో.. ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతూ బరి తెగిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో ఏం చేయాలన్న దానిపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కేంద్రానికి కీలక సూచన చేసింది.

ఐటీ నిబందనలు 2009ను సవాలు చేస్తూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణకు జస్టిస్ బీఆర్ఎస్ గవాయ్.. జస్టిస్ ఏజీ మాసిహ్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎవరైనా ఏదైనా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. దాన్ని తొలగించే ముందు వారి వాదనలను వినాలని భావిస్తున్నటులగా పేర్కొంది. సాఫ్ట్ వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ ఈ పిల్ ను దాఖలు చేయగా.. దీనిపై సీనియర్ న్యాయవాది ఇందిరాజైసింగ్ వాదనలు వినిపించారు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 69(ఏ) ప్రకారం.. సామాజిక మాధ్యమాల నుంచి సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. ఆ సమాచారానని పోస్టు చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. వారి వివరాలు బయటకు రాకుండా రక్షణ కల్పిస్తూ.. చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వం వ్యక్తుల మీద కాకుండా ఎక్స్ వంటి సోషల్ మీడియాప్లాట్ ఫాంలను సంప్రదిస్తూ.. వారి కంటెంట్ ను తొలగిస్తోంది.

ఇలా తొలగించటానికి ముందు నోటీసులు జారీ చేసి.. వారి వాదనలు వినాలని సుప్రీంకోర్టు కోరింది. దీనికి సంబంధించి ఆరువారాల్లో తమ స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకర పోస్టులను తొలగించటానికి ముందు.. ఆయా వ్యక్తులను గుర్తిస్తే.. వారికి నోటీసులు ఇవ్వటం.. వారు ఏమనుకుంటున్నారన్న అభిప్రాయాన్ని తెలుసుకోవటం ముఖ్యమన్న సుప్రీం ఆలోచనకు కేంద్రం ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.