Begin typing your search above and press return to search.

కుటుంబ సభ్యులపై గృహహింస కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

గృహ హింస ఫిర్యాదులపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ జరుగుతుందనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Feb 2025 9:30 AM GMT
కుటుంబ సభ్యులపై గృహహింస కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
X

గృహ హింస ఫిర్యాదులపై గత కొంతకాలంగా తీవ్రమైన చర్చ జరుగుతుందనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో చాలా వరకూ వాస్తవాల ఆధారంగానే ఫిర్యాదులు చేసి, కేసులు పెట్టినా.. మరికొన్నింటి విషయాల్లో తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులుగా ఉంటున్నాయనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును... ఇటీవల కాలంలో గృహ హింస ఫిర్యాదుల విషయంలో చాలా మంది గృహిణులు తమ భర్త, అత్తమామలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లుగా ఉంటున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ గృహ హింస ఫిర్యాదులపై సునిశిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఇదే సమయంలో.. ప్రధానంగా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వాములను చేయడం తగదని జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. విచక్షణారహితంగా కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించడం కఠినమైన గృహ హింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది.

గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో భాగంగా స్పందించిన ధర్మాసనం... వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని.. తనకు అండగా ముందుకు రాలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోలేదనే కోపంతో నిందితుడి కుటుంబ సభ్యులను, లేదా.. ఇరుగుపొరుగువారిని కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని అభిప్రాయపడింది.

వరకట్నం వేధింపుల కేసులో భర్తతో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ తోపాటు అత్త చెల్లెలు, ఆమె కుమారుడిని నిందితులుగా చేర్చగా.. వారిద్దరిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరకరించింది! దీంతో... ఆరోపణలు ఉన్నవారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. తగిన ఆధారాలు లేవంటూ అత్త చెల్లెలు, ఆమె కుమారుడిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది.

ఇదే సమయంలో.. బాధితురాలి ఫిర్యాదుపై భువనగిరి ట్రయల్ కోర్టు విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే.. కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించడం అనేది గృహ హింస చట్ట నిబంధనలను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. నిరాధారమైన ఆరోపణలు కుటుంబ వ్యవస్థను, బంధాలను, అనుబంధాలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.