Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు ఊరట

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు కేసు ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Sep 2024 6:36 AM GMT
బీఆర్ఎస్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు ఊరట
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు కేసు ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే. రాజకీయంగానూ ఈ కేసు పెను దుమారమే రేపింది. ఇద్దరు కీలక నేతలు ఇందులో భాగస్వామ్యం అయినట్లు ఆరోపణలు ఉండడంతో అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతుండడంతో ఆయన కేసులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు.

ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. సీఎం ప్రభావం చేస్తారనేది అపోహ మాత్రమే అని, ఆధారాలు లేకుండా ఎలా చెబుతారంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అదే సమయంలో కేసు విచారిస్తున్న ఏసీబీకి పలు సూచనలు చేసింది.

విచారణ జరుగుతున్న క్రమంలో ఎలాంటి రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికిన చేయొద్దని ఆదేశించింది. కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని అటు రేవంత్ రెడ్డిని సైతం ఆదేశఇంచింది. అలాగే.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌నూ తోసిపుచ్చింది. ఒకవేళ ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ జోక్యం చేసుకున్నారని తెలిస్తే అప్పుడు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.