Begin typing your search above and press return to search.

జగన్ అక్రమాస్తుల కేసు... రఘురామ పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

అవును... జగన్ అక్రమాస్తుల కేసులపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 10:49 AM GMT
జగన్  అక్రమాస్తుల కేసు... రఘురామ పిటిషన్  పై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
X

అటు సుప్రీంకోర్టులోనూ, ఇటు హైకోర్టులోనూ జగన్ కు సంబంధించిన వరుస కేసుల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే! అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా కావాలని, తనకు భద్రత తగ్గించారని జగన్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది! మరోపక్క సుప్రీంలో జగన్ అక్రమాస్తుల కేసులపై ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది.

అవును... జగన్ అక్రమాస్తుల కేసులపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ)పై అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా సీబీఐ మే 2న దాఖలు చేసిన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. కోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో.. దీనికీ ట్రయిల్ కూ సంబంధం లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన రఘురామ తరుపు న్యాయవాది కీలక అంశాన్ని లేవనెత్తారు.

ఈ క్రమంలో.. ఆరుగురు జడ్జిలు మారిపోవడం, రిటైర్డ్ కావడం జరిగిందని కొర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోపక్క... డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని.. ట్రయల్ ముందుకు సాగకుండా ఇది అడ్డంకిగా మారుతోందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం... తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశార్జ్ చేస్తున్నామని, తమకు ఎలాంటి అడ్డంకి లేదని తెలిపింది.

కాగా... జగన్ అక్రమాస్తుల కేసులపై రఘురామ కృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ కేసులను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ వేగవంతం చేయాలంటూ రఘురామ పిటిషన్ లో పేర్కొన్నారు! దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది.