Begin typing your search above and press return to search.

ఇక‌పై అలాంటి వారిపై పంచ్ లేస్తే ప‌నిష్ మెంట్!

ఈ విష‌యంలో కొంత‌మంది ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లు, క‌నీసం మాన‌వ‌తా కోణంలో కూడా ఆలోచించ‌కుండా సినిమాలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   9 July 2024 2:30 PM GMT
ఇక‌పై అలాంటి వారిపై పంచ్ లేస్తే ప‌నిష్ మెంట్!
X

కొన్ని సినిమాలు మ‌నోభావాలు దెబ్బ తీస్తోన్న మాట వాస్త‌వం. ఎంట‌ర్ టైన్ మెంట్ పేరుతో హ‌ద్దులు మీరి కొన్ని చెడు సంకేతాలు స‌మాజంలోకి పంపిస్తున్నారు. ఈ విధానం అన్ని భాష‌ల ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ ద‌క్షిణాది భాష‌ల సినిమాలు ప్ర‌ధానంగా ఈ విమ‌ర్శ‌ల్ని ఎదుర్కుంటున్నాయి. వినోదం కోసం వికలాంగులను అగౌరవంగా , కించపరిచే విధంగా కొంద‌రు ద‌ర్శ‌కులు సినిమాలు తీస్తున్నారు.

ఈ విష‌యంలో కొంత‌మంది ఎలాంటి నియ‌మ నిబంధ‌న‌లు, క‌నీసం మాన‌వ‌తా కోణంలో కూడా ఆలోచించ‌కుండా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారిపై సుప్రీంకోర్టు కొర‌డా ఝుళిపించింది. జూలై 8, 2024న, భారత సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వికలాంగులను చలనచిత్రాల్లో ఎలా చూపించాలో కొన్ని నియమాలను రూపొందించింది. మృణాల్ ఠాకూర్ - పరేష్ రావల్ నటించిన `ఆంఖ్ మిచోలీ` చిత్రంలో వికలాంగ పాత్రలను సున్నితంగా చూపించడంపై వచ్చిన ఫిర్యాదు నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు `సినిమాల్లో వికలాంగులను గౌరవంగా, కచ్చితంగా చూపించాలని సూచించారు. `సినిమాలు ప్రజల ఆలోచనల తీరుపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. వికలాంగులను తప్పుగా చూపించడం అతి పెద్ద త‌ప్పు. అది స‌మాజంలోకి వెళ్ల‌డం నేరంగానే చెప్పాలి. ఇది వివ‌క్ష నిరోధ‌క చ‌ట్టం కింద‌కు వస్తుంది. కాబ‌ట్టి ఫిజిక‌ల్లీ ఛాలెంజింగ్ పర్స‌న్ప్ ని క‌చ్చితంగా గౌర‌విస్తూనే క‌థ‌, క‌థ‌నాలుండాలి. ఇక‌పై ఇలాంటి మూస ప‌ద్ద‌తుల‌కు అంతా చ‌ర‌మ గీతం పాడాలి .

విక‌లాంగుల నిజ జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ల మాన‌సిక ప‌రిస్థితిని అర్దం చేసుకుని మంచి చేసేలా క‌థ‌లు ఉండాలి? వాళ్ల లో స్పూర్తిని నింపాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది అని కోర్టు పేర్కొంది. విక‌లాంగుల‌ను అర్దం చేసుకుని వారికి స‌హాయ‌ప‌డేలా వ్య‌వ‌స్థ‌లు, వ్య‌క్తులు వ్య‌వ‌రించాలని కోర్టు ఆదేశించింది. దీంతో వికలాంగుల హక్కుల కార్యకర్తలు, ప్రజలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు ఆడియ‌న్స్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌బ‌ర్దస్త్ షోలో ఇక‌పై విక‌లాంగుల్ని కించ‌ప‌రిచేలా క‌థ‌లు రాస్తే అలాంటి వారిపై త‌ప్ప‌క చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.