ఓటుకు నోటు కేసులో సుప్రీంలో కీలక పరిణామం!.. తెరపైకి మందలింపులు!
అవును... తెలంగాణలోని ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీంలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Aug 2024 10:26 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటుకు నోటు కేసు ఎంత సంచలనం అనేది అందరికీ తెలిసిందే! ఒకానొక సమయంలో ఈ కేసు వల్ల రాజకీయంగా ఎన్నో పెను మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి. ఏపీ (ఉమ్మడి) రాజధాని విషయంలోనూ ఈ కేసు అప్పట్లో కీలక భూమిక పోషించిందని చెబుతారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... తెలంగాణలోని ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు సుప్రీంలో ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ మాజీ ఎమెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై సుప్రీకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు భారీ ఊరట కల్పిస్తూనే రామకృష్ణారెడ్డిని మందలించిందని తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణలో ఓటుకు నోటు కేసు విషయంలో వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ మేరకు.. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు పాత్రపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. ఆ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా... ఆర్కేని మందలించిన పరిస్థితి అని అంటున్నారు.
ఇదే క్రమంలో... గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా... రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేష్ ధర్మాసనం హెచ్చరించింది!