Begin typing your search above and press return to search.

‘మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రోమియో పేరుతో సోదాలకు చెక్ చెప్పం’ టీ హైకోర్టు

శాంతిభద్రతలు.. అసాంఘిక కార్యకలాపాల్ని నిర్వహించే వారికి చెక్ పెట్టేందుకు వీలుగా మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రోమియో పేర్లతో నిర్వహించే సోదాలను నిలిపేసేందుకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 6:30 AM GMT
‘మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రోమియో పేరుతో సోదాలకు చెక్ చెప్పం’ టీ హైకోర్టు
X

శాంతిభద్రతలు.. అసాంఘిక కార్యకలాపాల్ని నిర్వహించే వారికి చెక్ పెట్టేందుకు వీలుగా మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రోమియో పేర్లతో నిర్వహించే సోదాలను నిలిపేసేందుకు తెలంగాణ హైకోర్టు నో చెప్పింది. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ అంశాలపై వివరణలు ఇవ్వాలంటూ హోం శాఖ ముఖ్యకార్యదర్శి.. డీజీపీ.. నగర పోలీసు కమిషనర్ కు నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆకస్మిక సోదాలు నిర్వహించటం ద్వారా నేరస్తుల్ని అదుపులోకి తీసుకోవటానికి.. అసాంఘిక కార్యకలాపాల్ని గుర్తించేందుకు వీలుగా హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త మసూద్ తాజాగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని వేశారు. మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రొమియో.. మిడ్ నైట్ కౌన్సెలింగ్ లాంటి పేర్లతో సోదాల్ని నిర్వహించటాన్ని పిటిషనర్ సవాలు విసిరారు. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే.. జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణను చేపట్టింది.

నిబంధనల ప్రకారం ఉదయం ఐదు గంటల నుంచి అర్థరాత్రి పన్నెండు గంటల వరకు వ్యాపారాలు చేసుకోవటానికి చట్టం వెసులుబాటు కల్పిస్తుందని.. కానీ వీధి వ్యాపారుల్ని మాత్రం రాత్రి పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల మధ్యలోనే వ్యాపారాల్ని బంద్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. 2015లో జారీ చేసిన జీవోకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు. సోదాల వేళ.. గుర్తింపుకార్డులు చూపాలంటూ ప్రజలు.. ఇళ్లల్లోని మహిళల్ని వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

పేదలు నివసించే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సోదాలు నిర్వహిస్తారని.. అందుకే మిషన్ చబుత్రా.. ఆపరేషన్ రోమియో పేర్లతో నిర్వహించే సోదాల్ని ఆపేయాలని.. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లోని పేరు ప పోవటంతో పాటు.. ఆస్తుల ధరలు తగ్గతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ పిటిషనర్ కూడా బాధితుడే అన్న విషయాన్ని న్యావాది చెప్పగా.. వారి వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలు వాయిదా వేస్తున్నట్లుగా పేర్కొన్నారు.