తెలంగాణ హైకోర్టు ఆదేశాలు: వేణు పరాంకుశానికి కొత్త చిక్కులు!
ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వేణు పరాంకుశం పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
By: Tupaki Desk | 28 Oct 2024 10:07 AM GMTటాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై జాతక వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో చిక్కుకున్న జ్యోతిష్కుడు వేణు పరాంకుశానికి తెలంగాణ హైకోర్టు తాజాగా మరో షాక్ ఇచ్చింది. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ సమయంలో రకరకాల అభిప్రాయాలు రావొచ్చని, వారు విడిపోవచ్చని చేసిన జ్యోతిష్య ప్రకటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వేణు పరాంకుశం పై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
మహిళా కమిషన్ వేణును వ్యక్తిగతంగా హాజరుకావాలని గతంలో ఆదేశించింది. అయితే కమిషన్‌కు ఇలాంటి చర్యలు తీసుకునే అధికారం లేదని వాదిస్తూ వేణు కోర్టులో స్టే తెచ్చుకున్నాడు. దీంతో మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాలపై పరిశీలించి స్టే ఎత్తివేస్తూ వేణు పై చర్యలు తీసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది.
న్యాయస్థానం తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం, మహిళా కమిషన్‌కు వేణుపై చర్యలు తీసుకునే పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. దీంతో వేణు కు సమస్యలు మరింత తీవ్రంగా మారాయి. ఈ తీర్పు ప్రకారం, కమిషన్ ఇప్పటికీ వేణు పై దర్యాప్తు చేసేందుకు వీలు ఉంది. వారం రోజులలో వేణుపై తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
నాగ చైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ సమయంలో వారి భవిష్యత్తు పై విభజనల జ్యోతిష్యం చెప్తూ వేణు చేసిన వ్యాఖ్యలు అభిమానులను, సినీ ప్రముఖులను ఆగ్రహానికి గురి చేశాయి. ఈ వ్యాఖ్యలు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ వాటి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వేణు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా వేణు పై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ప్రయత్నిస్తుండగా, ఈ చర్యలకు వేణు వ్యతిరేకంగా స్టే తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు హైకోర్టు స్టే ఎత్తివేసింది. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు, మహిళా కమిషన్ తీసుకున్న చర్యలు ఇప్పుడు వేణు పై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చాయి.