బిగ్ బ్రేకింగ్... 'ఎన్' కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు!
మాదాపూర్ లోని "ఎన్" కన్వెషన్ కూల్చివేత అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Aug 2024 9:40 AM GMTమాదాపూర్ లోని "ఎన్" కన్వెషన్ కూల్చివేత అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... నాగార్జున పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. ఇప్పుడు ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఎన్ కన్వెషన్ కూల్చివేత అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ హీరో నాగార్జున స్పందించారు. ఇందులో భాగంగా... ఆ భూమి పట్టా భూమని.. అది పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమని వెల్లడించారు. ఇప్పుడు జరిగిన కూల్చివేతల చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో నాగార్జున వేసిన పిటిషన్ పై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు! ఈ సందర్భంగా మాదాపూర్ లోని ఎన్ కన్వెషన్ కూల్చివేతలు ఆపాలని మద్యంతర ఉత్తర్యులు జారీ చేశారు. ఇలా ఎన్ కన్వెషన్ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు మద్యంతర ఉత్తర్యులు ఇవ్వడంతో ఇప్పుడు హైడ్రా / ప్రభుత్వం వెర్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.
కాగా.. హైడ్రా చేపట్టిన ఎన్ కన్వెషన్ కూల్చివేత వ్యవహారంపై ఎక్స్ వేదికగా స్పందించిన నాగార్జున కీలక వ్యాఖ్యలు చేస్తూ.. కోర్టును ఆశ్రయిస్తామని.. అక్కడ తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. ఇప్పటికే ఉన్న స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా "ఎన్" కన్వెషన్ కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అన్నారు.
ఆ భూమి పట్టా భూమి అని.. అందులో ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదని.. పూర్తిగా ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం అది అని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడిందని చెబుతూ... స్పష్టంగా చెప్పాలంటే ఇప్పుడు జరిగిన కూల్చివేతల చట్ట విరుద్ధంగా.. లేదా, తప్పుడు సమాచారంతో జరిగిందని అన్నారు.
ఈ నేపథ్యంలో ఎక్స్ లో వెళ్లడించినట్లుగానే నాగార్జున ఈ కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించగా... ఈ కూల్చివేతలు ఆపాలంటూ ఉన్నత న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చింది.