Begin typing your search above and press return to search.

పెళ్లైన 40 రోజుల్లో ఆరుసార్లే స్నానం... డివోర్స్ ప్లీజ్!

కారణం ఏదైనా ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న (నూతన) జంటల సంఖ్య పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 1:30 PM GMT
పెళ్లైన 40 రోజుల్లో ఆరుసార్లే స్నానం... డివోర్స్  ప్లీజ్!
X

కారణం ఏదైనా ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న (నూతన) జంటల సంఖ్య పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా, ఎవరైనా.. విడాకులే ప్రత్యామ్నాయంగా నేటి యువత ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అందుకు గల కారణం ఆసక్తికరంగా ఉంది!

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. అందుకు ఆమె చెప్పిన కారణం... భర్త పరిశుభ్రత పాటించకపోవడమే అని. తన భర్త నెలకు మరీ రెండు మూడు సార్లు మాత్రమే స్నానం చేస్తున్నాడని సదరు మహిళ తన పిటిషన్ లో పేర్కొంది. దీంతో... ఈ వ్యవహారం వైరల్ గా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం రాజేష్ అనే వ్యక్తి రెగ్యులర్ గా స్నానం చేయడం లేదని, నెలకు రెండు మూడు సార్లు మాత్రమే చేస్తున్నాడని, ఫలితంగా అతడి నుంచి వచ్చే దుర్వాసనను భరించలేని పరిస్థితికి అతడి భార్య వచ్చిందని, దీంతో పుట్టింటికి వెళ్లిపోయిందని తెలుస్తోంది. అతడు గంగానది నుంచి తెచ్చుకున్న నీటిని శరీరంపై చల్లుకుంటాడే తప్ప స్నానం చేయడంట.

తనకు పెళ్లైన ఈ 40 రోజుల్లో కేవలం ఆరుసార్లు మాత్రమే స్నానం చేశాడంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించిందని తెలుస్తోంది. దీంతో... ఇద్దరి మధ్య రెగ్యులర్ గా ఘర్షణలు జరగడంతో ఆమె తన తల్లితండ్రుల వద్దకు తిరిగి వచ్చేసింది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో వరకట్నం వేధింపుల కేసు పెట్టినట్లు చెబుతున్నారు.

దీంతో... ఆగ్రాలోని ఓ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో.. తన పరిశుభ్రతను మెరుగుపరుచుకుంటానని, ఇందులో భాగంగా రోజూ స్నానం చేస్తానని హామీ ఇచ్చాడంట. అయినప్పటికీ ఆమె మాత్రం తనకు విడాకులు కవాల్సిందేనని కోరుతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 22న మరోసారి కౌన్సిలింగ్ సెంటర్ కు రావాలని కోరినట్లు చెబుతున్నారు. మరి ఆ కౌన్సెలింగ్ లో అయినా వీరి వివాహం సెట్ అవుతుందా.. రద్దు వైపే వెళ్తుందా అనేది వేచి చూడాలి.