Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. కోర్టు ఏదైనా షాక్ కామన్!!

ఈ బెయిల్ పిటిషన్ పై కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

By:  Tupaki Desk   |   28 March 2025 11:29 AM
వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. కోర్టు ఏదైనా షాక్ కామన్!!
X

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పటికే సీఐడీ కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలని కోర్టుకు ఆయన తరుపు న్యాయవాది విన్నవించారు. ఈ పిటిషన్ పై మంగళవారం వాదనలు ముగిశాయి.

ఈ సమయంలో.. వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీఐడీ తన వాదనలు వినిపించింది. ఈ నేపథ్యంలో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.. గురువారం తీర్పు వెలువరించారు. ఇందులో భాగంగా.. వంశీ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు. వంశీతోపాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో నలుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.

ఇక మరోపక్క.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో.. వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అయితే.. అక్కడా వంశీకి షాక్ తప్పలేదు. ఇందులో భాగంగా... ఆ కేసులో వంశీకి రిమాండ్ ను ఏప్రిల్ 9వ తేదీ వరకూ పొడిగించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్సీ, ఎస్టీ కోర్టులోనూ షాక్ తగిలింది.

సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. ఈ బెయిల్ పిటిషన్ పై కోర్టు నేడు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా.. వంశీ బెయిల్ పిటిషన్ ను విజయవాడ అట్రాసిటీ కేసుల కోర్టు కొట్టివేసింది. దీంతో... వంశీకి కోర్టు ఏదైనా షాక్ కామన్ అనే చర్చ మొదలైందని అంటున్నారు!