Begin typing your search above and press return to search.

ఒంటరి మహిళలే లక్ష్యంగా భార్యభర్తల దారుణాలు.. కోర్టు సంచలన తీర్పు!

వివరాళ్లోకి వెళ్తే... వికారాబాద్ జిల్లాలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి (30), నర్సమ్మ భార్యభర్తలు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 6:55 AM GMT
ఒంటరి మహిళలే లక్ష్యంగా భార్యభర్తల దారుణాలు.. కోర్టు సంచలన తీర్పు!
X

భర్త తప్పుదారి పడితే నిలదీయాల్సిన భార్యే.. అతడు చేసే తప్పుడు పనులకు సహకరించడం మొదలుపెట్టింది! భర్తతో కలిసి ఒంటరి మహిళలే లక్ష్యంగా దారుణాలకు ఒడిగట్టింది! భార్య ఈ స్థాయిలో సహకరిస్తుండటంతోనో ఏమో కానీ... భర్త చెలరేగిపోయాడు! అత్యాచారం చేసి హత్య చేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాడు! ఈ సమయంలో వీరికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

అవును... ఒంటరి మహిళలపై అత్యాచారం, అనంతరం నిలువు దోపిడీ, ప్రతిఘటిస్తే దారుణంగా హత్య చేయడాన్ని వృత్తిగా పెట్టుకుంది ఓ జంట! సంచలనం సృష్టించిన ఈ భార్యభర్తల నేరాల్లోని మూడూ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు విడివిడిగా తీర్పులు వెలువరించింది. ఇందులో ఓ కేసులో జీవిత ఖైదు విధించగా.. మరో కేసులో భర్తకు పదేళ్లు, భార్యకు ఏడేళ్లు శిక్ష విధించింది.

వివరాళ్లోకి వెళ్తే... వికారాబాద్ జిల్లాలోని జనగాం గ్రామానికి చెందిన కురువ స్వామి (30), నర్సమ్మ భార్యభర్తలు. వీరు రంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో స్థిరపడ్డారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి, సులువుగా డబ్బులు సంపాదించడానికి వీరు ఒంటరి మహిళలను దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడే క్రమంలో అత్యాచారం, హత్య కూడా చేశారు!

ఈ క్రమంలో 2021 జూలై 25న మల్లంపేట్ అడ్డాలో పని కోసం నిరీక్షిస్తున్న ఓ మహిళకు కూలిపని ఉందని చెప్పి బైక్ పై తీసుకెళ్లారు. ఈ సమయంలో దండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులోని నిర్జన ప్రదేశంలో ఆ మహిళపై స్వామి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో సదరు మహిళ ప్రతిఘటించింది. దీంతో... భార్య నర్సమ్మ ఆమెను గట్టిగా బంధించగా స్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

అనంతరం బాధితురాలి ఒంటిపై ఉన్న నగలు దోచ్కున్న భార్యభర్తలు.. ఆమెను హత్యచేశారు. ఇదే క్రమంలో అదే ఏడాది సింగాపురం గ్రామంలోని ఓ మహిళకు కూలిపని చూపిస్తామని చెప్పి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఇలానే భార్య సహకారంతో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆమె ఫోను, ఒంటిపై ఆభరణాలు తీసుకొని పరారయ్యారు.

ఈ తరహాలోనే అమీనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దోపిడీకి పాల్పడ్డారు ఈ దంపతులు. వీటిలో మల్లంపేట్ అడ్డాలోని కేసుకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం!!