Begin typing your search above and press return to search.

500 మహిళలతో సంబంధం ఇష్యూ... భర్తపై భార్య పిటిషన్!

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని తంజావూరుకి చెందిన ఆర్తీ అనే మహిళ తాజాగా మధురై ధర్మాసనంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:28 AM GMT
500 మహిళలతో సంబంధం ఇష్యూ...  భర్తపై భార్య పిటిషన్!
X

తనకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు.. తన భర్తకు మరో పని లేనట్లుగా ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడమే పనిగా ఉంటున్నాడు.. అతని సెల్ ఫోన్ నిండా అసభ్యకరంగా ఉన్న వీడియో కాల్ స్క్రీన్ షాట్లు, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలే ఉన్నాయి.. అడిగితే బెదిరిస్తున్నాడు.. సీఐడీ ఎంక్వైరీ అవసరం అయ్యేలా ఉంది పరిస్థితి అంటూ ఒక మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అవును... తన భర్త మామూలోడు కాదని.. ఊరి నిండా యౌవ్వారాలే ఉన్నట్లున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు సుమారు 500 మంది మహిళలతో అతనికి సంబంధం ఉన్నట్లుంది.. అతని ఫోన్ లో ఉన్న 500 - 1000 అసభ్యకరమైన వీడియోలు, వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటూ ఒక మహిళ తాజాగా ఇచ్చిన పిటిషన్ పై విచారణ జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... తమిళనాడులోని తంజావూరుకి చెందిన ఆర్తీ అనే మహిళ తాజాగా మధురై ధర్మాసనంలో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో భాగంగా... తనకు వివేక్ రాజ్ అనే వ్యక్తితో వివాహం అయ్యిందని, ఇద్దరం కలిసే జీవిస్తున్నామని పేర్కొంది. ఈ సమయంలో ఒకరోజు తన భర్త సెల్ ఫోన్ చూడగా అందులో అసఖ్యకరమైన వీడియో కాల్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయని పేర్కొంది.

ఇదే సమయంలో... ఆ సెల్ ఫోన్ నిండా అశ్లీక ఫోటోలు, వందల సంఖ్యలో అసభ్యకర వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై తన భర్త, తల్లితండ్రులను ప్రశ్నించగా... ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు తెలిపారు. ఇదే సమయంలో... తాను రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడిచేయడం వల్ల అబర్షన్ అయ్యిందని వెల్లడించారు. ఈ విషయాలపై తంజావూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఈ కేసుకు సంబంధించి సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలని ఆమె కోర్టును కోరారు. దీంతో... ఈ పిటిషన్‌ జస్టిస్‌ సుకుమార గురు ఎదుట విచారణకు వచ్చింది. ఈ నేపథ్యలో స్పందించిన న్యాయమూర్తి... ఈ పిటిషన్ పై తంజావూరు ఎస్పీ, సీబీ సీఐడీ జవాబివ్వాలని ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణ వాయిదా వేశారు. ఇప్పుడు ఈ కేసు స్థానికంగా వైరల్ గా మారింది.