Begin typing your search above and press return to search.
సెలబ్రిటీలు.. వారి లగ్జరీ లైఫ్‌స్టైల్ సింబల్స్!
By: Tupaki Desk | 8 July 2015 7:39 AM GMT'లగ్జరీ' ఎక్కడిక్క నిర్వచనం మారిపోయే అంశం ఇది. ఒక్కోరి దృష్టిలో ఒక్కోటి 'లగ్జరీ' అనిపిస్తుంది. వారి వారి ఆర్థిక శక్తే కాదు.. వారి మానసిక అభిరుచులు కూడా 'లగ్జరీ'కి నిర్వచనాలను మార్చేస్తూ ఉంటుంది. మరి అన్నింటినీ అందుకొనే అవకాశం ఉన్నా కూడా.. కొన్నే ఇష్టం అనిపిస్తాయి. అవే లగ్జరీ అనిపిస్తాయి. ఈ మేరకు సెలబ్రిటీలను కదిలిస్తే.. వారు అనుభవిస్తున్న లగ్జరీలు ఏమిటి.. అనే విషయం గురించి ఆరా తీస్తే ఇలా సమాధానమిచ్చారు.
ఆమిర్ ఖాన్: తనకు సోకాల్డ్ లగ్జరీ లైఫ్‌స్టైల్ మీద పెద్దగా ఆసక్తి లేదు.. అని అంటూనే ఖరీదైన కారుమీద మక్కువను బయటపెట్టుకొన్నాడు ఆమిర్. తను కస్టమైజ్ చేయించుకొన్న బెజ్-600 కారులోని లగ్జరీ ఆమిర్‌ను కట్టిపడేసిందట. దానిలోని సాంకేతిక అంశాలు వావ్ అనిపించాయట. కారే ఖరీదైనది.. దానికోతోడు మాడిఫికేషన్ కోసం కోట్లు పోశారు. దీంతో ఈ కారులో ప్రయాణం ఆమిర్‌కు గొప్ప సౌకర్యవంతంగా అనిపిస్తుందట. దీని కంటే లగ్జరీ ఏముంది? అని ఆమిర్ అంటాడు!
సైఫ్, కరీనా: అత్యంత విలాసవంతమైన భవనాల్లో గడపడం ఈ దంపతులకు లగ్జరీ అనిపిస్తుంది. ఈ విషయాన్ని వారు చాలా ముచ్చటగా చెప్పుకొన్నారు. రాజరిక కుటుంబం నుంచి వచ్చిన సైఫ్, సినిమా కుటుంబం నుంచి వచ్చిన కరీనాల టేస్టు ఈ విషయంలో ఒక్కటే. అందమైన భవంతులే వీరి లగ్జరీ. మరి ఆ భవంతులేవి? అని ఆరా తీస్తే.. స్విట్జర్లాండ్‌లో గిస్తాద్ భవంతి మహగొప్పగా ఉంఉందని సైఫ్ చెబుతాడు. అలాగే ఈ జంటకు హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్ అంటే ఎంతో ఇష్టమట. తమ వివాహాన్ని కూడా ఇక్కడే చేసుకొందామని భావించారట. అయితే ముంబాయి నుంచి అందరూ రావడం కష్టమవుతుందని ఆ ముచ్చట తీర్చుకోలేకపోయారట పాపం. ఈ స్థాయిలో ఉంది వీరికి ఖరీదైన, భారీ భవంతులమీద ఇష్టం.
ప్రియాంకాచోప్రా: రోల్స్‌రాయిస్.. ఈ భామకు కూడా కారే లగ్జరీ చిహ్నం. తను స్వశక్తితో సంపాదించుకొన్న సొమ్ముతో కొన్న ఆ కారు తనకు ఎంతో ఇష్టమని.. అందులో జర్నీ అంటే అంతకు మించిన లగ్జరీ లైఫ్ లేదనిపిస్తుందని ప్రియాంక చెబుతుంది.
ఐశ్వర్యరాయ్ బచ్చన్: ఈ మాజీ ప్రపంచ సుందరికి వస్తువలు మీద, కార్లమీద మమకారం లేదు. ఆమె లైఫ్ స్టైల్ లగ్జరీ అనేది ప్రదేశాలతో ముడిపడినది. రోబో సినిమా షూటింగ్ కోసం పెరూ వెళ్లినప్పుడు మచ్చుపిచ్చుకు పక్కనే ఉన్న ఒక టౌన్ ఆమెకు అద్భుతంగా అనిపించిందట. అక్కడ గడపడం అంటే.. అందకు మించిన గర్వకారణం లేదు.. అంతకు మించిన లగ్జరీ లేదు.. అని ఐశ్వర్య చెప్పుకొచ్చింది.
సోనమ్‌కపూర్: పుట్టుకతోనే ఒక పెద్దింటి నేపథ్యం. తండ్రి ఒక స్టార్ హీరో.. మరి ఇలాంటి వారి టేస్ట్‌లు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. సోనమ్ ను ఈ విషయంలో కదిలిస్తే ఆమె ఖండతారాల అవతల ఉన్న ఒక హోటల్‌పేరు చెబుతుంది. ఫ్రాన్స్‌లో యాంటిబ్స్ దగ్గర డ్యూకాప్ ఈడెన్ అనే ఒక హోటల్ ఉందని.. అందులో ఉండే ప్రతి క్షణం లగ్జరీనే అని సోనమ్ చెబుతుంది. ఎన్నో హోటల్స్‌లో స్టే చేసిన తనకు అది అత్యంత విలాసవంతం అనిపించిందని సోనమ్ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఉంటే తనువు మరో ప్రపంచంలో తేలియాడుతున్నట్టుగా ఉంటుందని వర్ణనలు చేస్తుంది సోనమ్.