Begin typing your search above and press return to search.
మార్షల్‌ఆర్ట్స్‌లో శక్తి.. మెదడు నుంచి జనిస్తుందా!
By: Tupaki Desk | 11 July 2015 5:29 AM GMTవరసగా పేర్చిన ఇటుకలను ఒక్క దెబ్బతో పగలగొట్టేస్తారు.. పటిష్టంగా, పగలడం అసాధ్యం అనిపించే కుండలను ఒక్క పంచ్‌తో పిప్పి చేస్తారు... శారీరకంగా చూస్తే మాత్రం వారికి బక్కపల్చాగే ఉంటారు! మరి వారికి ఆ శక్తి ఎలా వస్తుంది? మార్షల్ ఆర్ట్స్ నేర్పరులు అలా ఎలా చేయగలరు.. అనేది ఎవరికైనా కలిగే సందేహం! తర్ఫీదు పొందారు కాబట్టి అలాంటి ఫీట్లు చేయగలరు..అనేయవచ్చు. అయితే శారీరకంగా బలవంతులు కూడా చేయలేని ఆ పనుల కోసం బక్క పల్చని వారికి ఎలా శక్తి చేకూరుతుంది? అనేదానిపై తాజాగా ఒక పరిశోధన జరిగింది.
ఆ పరిశోధన ప్రకారం.. తేలింది ఏమిటంటే.. మార్షల్ ఆర్ట్స్‌లోని వ్యక్తులది శారీరక శక్తి కాదు. అది మెదడులోని శక్తి. కరాటే వంటి విద్యల్లో మెదడు ప్రభావితం అవుతుంది. మెదడులోని సెర్రిబెల్లమ్ ఉత్తేజితం అవుతుంది. అది ఇచ్చే శక్తితోనే ఫైటర్ల పంచ్‌కు పవర్ పెరుగుతుంది. సెర్రిబెల్లమ్‌ఇచ్చే శక్తితో ముంజేయి, భుజం దగ్గరి కండరాలు శరవేగంగా కదులుతాయి. దీంతో పవర్ పెరుగుతుంది. శక్తి మొత్తం ఒకచోట కేంద్రీకృతం అయ్యేలా నాడీ వ్యవస్థ చేసే మ్యాజిక్కే మార్షల్ ఆర్ట్స్‌లో దాగున్న రహస్యం అని పరిశోధకులు తేల్చారు. కొన్ని సంవత్సరాల పాటు జరిపిన అధ్యయనంతో వారు ఈ విషయాన్ని కనుగొన్నారు.