Begin typing your search above and press return to search.

ఆ వాతావరణం శరీర బరువును తగ్గిస్తుంది!

By:  Tupaki Desk   |   11 July 2015 5:23 AM GMT
ఆ వాతావరణం శరీర బరువును తగ్గిస్తుంది!
X
లావవుతున్నామని భయపడేవాళ్లు... ఎలాగైనా బరువు తగ్గాలనే ప్రయత్నాల్లో ఉన్నవారు మనలో చాలా మంది ఉంటారు. స్లిమ్‌లుక్‌లో ఉండే అందం లావుగా ఉన్నవారికే అర్థం అవుతుంది! తాము కూడా స్లిమ్‌గా మారి స్మార్ట్‌గా తయారవ్వాలనే ఆశను, లక్ష్యాన్ని పెట్టుకొనేలా చేస్తుంది. మరి ఇలా బరువు తగ్గాలనుకొనే వారు తమ ప్రయత్నాల్లో తాముంటారు. వ్యాయామాలు చేయడం.. డైటింగ్‌ను అనుససరించడంల ద్వారా బరువును తగ్గే ప్రయత్నంలో ఉంటారు వీళ్లు.

మరి కేవలం డైటింగులు, వ్యాయామాలకే కాదు.. కొన్ని రకాల వాతావరణ పరిస్థితులకు కూడా మనిషి బరువును తగ్గించే శక్తి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. వీరి అధ్యయనాల ప్రకారం చల్లటి వాతావరణం మనిషి బరువును తగ్గిస్తుంది!

చల్లని వాతావరణంలో ఉన్నవారు బరువును తగ్గుతారు. శరీర వెచ్చదనాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా వరకూ క్యాలరీలు ఖర్చయిపోవడంతో వీరిలో ఇలాంటి మార్పు వస్తుందని అధ్యయనకర్తలు అంటున్నారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైందని వారు అంటున్నారు. మరి ఇదే నిజం అయితే.. శీతల ప్రదేశాల్లో ఉన్న జనాల్లో ఊభకాయ సమస్య ఎందుకు ఎక్కువగాఉంటుందనే సందేహాం కూడా కలుగుతంది. వారు ఖర్చయ్యే క్యాలరీల కన్నా ఎక్కువ శక్తిని శరీరంలోకి చేర్చే ఆహారాన్ని తీసుకొంటుంటారని.. అందుకే వారి శారీరక బరువు పెరిగిపోతూ ఉంటుందని అధ్యయనకర్తలు విశ్లేషించారు.

అలాగే మంచినీరు ఎక్కువగా తాగేవారు కూడా బరువు తగ్గుతారని ఈ అధ్యయనం తేల్చింది. తక్కువగా నీరు తాగే వారితో పోలిస్తే.. ఎక్కువగా మంచినీరు తాగే వారిలో నీటి విషయంలోనే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయని దాని వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని వారు తేల్చారు.