Begin typing your search above and press return to search.

ఆరోగ్యవంతమైన శిరోజాలు.. ఈ ఫుడ్‌తో సాధ్యం!

By:  Tupaki Desk   |   8 July 2015 7:45 AM GMT
ఆరోగ్యవంతమైన శిరోజాలు.. ఈ ఫుడ్‌తో సాధ్యం!
X
శిరోజ సంరక్షణకు.. వెంట్రుకల ఆరోగ్యానికి షాంపూలూ, కండీషనర్లే మార్గం అనే భావనలో మనలో ఎక్కువమందిలో ఉంటుంది. అయితే అసలైన శిరోజ సంరక్షణ శరీర అంతర్గతంగానే జరుగుతుంది. అది ఆహారంతోనే సాధ్యం అవుతుంది! తీసుకొనే ఆహారాన్ని బట్టి కూడా వెంట్రుకల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి ఆరోగ్యవంతమైన శిరోజాలకు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటంటే...

-నట్స్‌, సీడ్స్‌- గుమ్మడి గింజలు.. వీటిలో వెంట్రుకలను పెంచే శక్తి ఉంటుంది. అలాగే బయోటిన్‌, విటమిన్‌ ఇ, ఒమెగా 3, జింక్‌లు పుష్కలంగా ఉండే వాల్‌నట్స్‌ను తీసుకోవడం కూడా హెయిర్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

-గుడ్లు: జింకు లోపాన్ని అధిగమించడానికి ఎగ్స్‌ చాలా ఉపయోగకరమైనవి. గుడ్లు కుదుళ్లకు కొత్త బలాన్ని ఇచ్చి వెంట్రుకలను రాలడాన్ని నిరోధిస్తాయి.

-క్యారెట్స్‌, చిలకడదుంపలు: మాడును ఆరోగ్యవంతంగా మార్చగల శక్తి ఉంటుంది ఈ దుంపలకు. వెంట్రుల ఆరోగ్యానికి మాడు ఆరోగ్యవంతంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం కదా!

-చేపలు, వైట్‌మీట్‌: మాడును హైడ్రేట్‌ చేస్తుంది సీఫుడ్‌. ఒమెగా త్రీ అత్యధికంగా ఉండే చేపరకాలను భుజించడం చాలా మంచిది. చికెన్‌తో శిరోజాలకు అవసరమైన ప్రోటీన్లు అందుతాయి.

ఇంకా... బ్రొకోలీ, అవకాడో, ఇతర ఆకు కూరల్లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఐరన్‌లోపం వల్ల వెంట్రుకలు రాలిపోయే పరిస్థితిని ఈ ఫుడ్‌ నిరోధిస్తుంది. పాలు, పండ్లు కూడా ముఖ్యమే. వీటి ప్రభావం వల్ల కుదుళ్లు గట్టిపడి ఆరోగ్యమంతవుతాయి.